Astrologer Venu Swamy : మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన వేణుస్వామి భార్య
తప్పుడు రివ్యూ రాసి సినిమాలు హిట్ కాకుండా చేస్తున్న జర్నలిస్టులను మీడియాని మంచు విష్ణు ప్రశ్నించాలని వేణు స్వామి భార్య డిమాండ్ చేశారు
- By Sudheer Published Date - 07:58 PM, Tue - 13 August 24

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswami) నిత్యం వివాదాల్లో కేరాఫ్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ గుర్తింపు తెచ్చుకున్న వేణు..ఇప్పుడు అదే సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం తో వివాదాల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల (Chaitu – Shobitha Engagement) జంటపై కీలక వ్యాఖ్యలు చేయడం తో ఆయనపై అభిమానులే కాదు సినిమా ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వేణుస్వామి భార్య మీడియా పై కీలక వ్యాఖ్యలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తాను కూడా ఒక జర్నలిస్ట్ అంటూ పేర్కొన్న ఒక వీడియోను విడుదల చేశారు. సెలబ్రిటీలు కలిసి ఉంటారా.. విడిపోతారా అని జ్యోతిష్యం చెప్పే తన భర్త కన్నా, సెలబ్రిటీల జీవితంలోకి తొంగి చూసి మీడియా ఛానల్స్ ను ముందు ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేసారు. తనకు మంచు విష్ణు కాల్ చేసి అదే విషయం అడిగారని పేర్కొన్నారు. వేణు స్వామిని కాకుండా ఒక రివ్యూ తో సినిమాలపై పెట్టుకున్న ఆశల్ని చంపేస్తున్న జర్నలిస్టులను ప్రశ్నించాలని , తప్పుడు రివ్యూ రాసి సినిమాలు హిట్ కాకుండా చేస్తున్న జర్నలిస్టులను మీడియాని మంచు విష్ణు ప్రశ్నించాలని వేణు స్వామి భార్య డిమాండ్ చేశారు. ఇక వేణు స్వామి భార్య చేసిన వ్యాఖ్యలతో ఆమె పైన నెటిజెన్లు మండిపడుతున్నారు.
Read Also : Himachal Pradesh: ఊపందుకున్న HIV కేసులు, ఎక్కడో తెలుసా?