HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Devara Ram Charan Game Changer Movie Budget Details

Devara – Game Changer : దేవర, గేమ్ ఛేంజర్‌కి బాలీవుడ్డే దిక్కు.. లేకుంటే భారీ నష్టాలు..

దేవర, గేమ్ ఛేంజర్‌కి బాలీవుడ్డే దిక్కు. ఒకవేళ ఈ రెండు చిత్రాలు హిందీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి అంటే..

  • By News Desk Published Date - 12:55 PM, Mon - 29 April 24
  • daily-hunt
Ntr Devara Ram Charan Game Changer Movie Budget Details
Ntr Devara Ram Charan Game Changer Movie Budget Details

Devara – Game Changer : ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు గేమ్ ఛేంజర్, దేవర. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే రూపొందుతున్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. దేవరని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల పై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తో పాటు.. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

దీంతో మేకర్స్ కూడా ఈ రెండు చిత్రాలకు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఈ రెండు చిత్రాలకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. గేమ్ ఛేంజర్ సినిమా రెండేళ్ల క్రిందటే మొదలు పెట్టుకుంది. కానీ శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్ 2ని కూడా తెరకెక్కిస్తుండడంతో.. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ ఆలస్యంతో సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. ఇక దేవర విషయానికి వస్తే.. భారీ స్టార్ కాస్టింగ్, VFXతో తెరకెక్కిస్తుండడంతో బడ్జెట్ కొండెక్కింది.

ఈ రెండు చిత్రాలు బడ్జెట్ దాదాపు 400 కోట్లవరకు చేరుకున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ నుంచి నిర్మాతలు బయటపడాలంటే.. వెయ్యి కోట్ల మార్క్ ని తప్పకుండా అందుకోవాల్సి ఉంటుంది. అందుకు బాలీవుడ్ మార్కెట్ సపోర్ట్ తప్పకుండా కావాల్సిందే. హిందీ ఆడియన్స్ ని ఈ రెండు సినిమాలు ఆకట్టుకుంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టం ఏమి కాదు. కానీ ఒకవేళ ఈ రెండు చిత్రాలు హిందీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి అంటే.. భారీ నష్టాలను చూడాల్సి ఉంటుంది.

మరి ఈ ఆర్ఆర్ఆర్ హీరోలు ఈ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. కాగా దేవర దసరా సమయంలో అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. గేమ్ ఛేంజర్ ఇంకా విడుదల తేదీని ఫిక్స్ చేసుకోలేదు.

Also read : OG – Game Changer : ఓజి, గేమ్ ఛేంజర్ రిలీజ్.. అబ్బాయి కోసం బాబాయ్ వెనక్కి తగ్గుతున్నాడా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Game Changer
  • ntr
  • ram charan

Related News

Chikiri Peddi

Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

Peddi Chikiri Chikiri Song : తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్‌ విడుదలైన 14 గంటల్లోనే 28 మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం

  • Ntr New Look

    NTR New Look : ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ కేక

  • Chikiri Peddi

    Peddi : పెద్ది ఫస్ట్ ప్రోమో..ఇది కదా రహమాన్ నుండి కోరుకుంటుంది !!

Latest News

  • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd