NTR : దేవర నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
NTR యంగ్ టైగర్ ఎన్.టి.అర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్
- By Ramesh Published Date - 12:24 PM, Thu - 12 October 23
NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. దేవర సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా కూడా తారాస్థాయి అంచనాలతో ఉన్నారు. అయితే ఈ సినిమా ఆడియన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా దానికి మించి ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెబుతున్నారు.
దేవర సినిమాలో తారక్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అని.. సినిమాలో ఆయన నటన చూసి అందరు ఫిదా అవుతారని అంటున్నారు. ఇక రీసెంట్ గా సినిమా కోసం అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేశారట. ఈ సీన్ ఒక్కటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. సినిమాలో సగం బడ్జెట్ యాక్షన్ సీన్స్ కోసమే కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.
Also Read : Indian 3 : ఇండియన్ 3 కూడా.. శంకర్ తో కమల్ ప్లాన్ అదుర్స్..!
ఇక దేవర (Devara) సినిమా కథ బాగా కుదరడం ఇప్పటివరకు చేసిన షూటింగ్ కూడా బాగా వస్తుండటం వల్ల సినిమా ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా ఇదే విషయాన్ని కొరటాల శివ వెల్లడించారు. దేవరలో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని ఆయన అన్నారు. సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంచనాలు పెంచారు.
దేవర సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామనే రంగంలోకి దించే ప్లానింగ్ లో ఉన్నారు. దేవర సినిమా తో ఎన్.టి.ఆర్ మరోసారి తన రేంజ్ ఏంటన్నది చూపించాలని చూస్తున్నారు. RRR తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవర (NTR Devara) తో తన పొటెన్షియల్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
Related News
Pawan Kalyan : అప్పుడు ఎన్టీఆర్.. ఇటీవల విజయ్.. ఇప్పుడు పవన్.. ఈసారి ఫైట్ ఎలా ఉంటుందో..?
అప్పుడు ఎన్టీఆర్, ఇటీవల విజయ్ తమ ఫైట్ తో ఆడియన్స్ ని మెప్పించారు. మరి ఇప్పుడు రాబోతున్న పవన్ కళ్యాణ్ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.