NTR – Atlee : అట్లీతో ఎన్టీఆర్ సినిమా.. ఆల్రెడీ కథ కూడా విన్నాను.. కానీ..
తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరో డైరెక్టర్ గురించి మాట్లాడారు ఎన్టీఆర్.
- By News Desk Published Date - 03:08 PM, Thu - 19 September 24

NTR – Atlee : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవల చెన్నైలో ఓ ప్రెస్ మెట్ నిర్వహించారు. అలాగే చెన్నై మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చెన్నై ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. చెన్నై ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తనకు వెట్రి మారన్ తో సినిమా చేయాలని ఉందని చెప్పిన సంగతి వైరల్ అయింది. గతంలో ఆల్రెడీ ఎన్టీఆర్ – వెట్రిమారన్ మధ్య చర్చలు జరిగినా ఆ సినిమా పట్టాలెక్కలేదు.
తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరో డైరెక్టర్ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అట్లీ మంచి డైరెక్టర్. అతని రాజారాణి సినిమా నాకు చాలా నచ్చింది. ఆల్రెడీ అట్లీ నాకు ఒక రొమాంటిక్ కామెడీ కథ చెప్పారు. దాని గురించి మేము కొన్నాళ్ళు చర్చించుకున్నాం. కానీ నేను, అట్లీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా ముందుకు సాగలేదు. భవిష్యత్తులో కచ్చితంగా అట్లీతో సినిమా చేస్తాను అని తెలిపారు.
అలాగే.. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ వర్క్ కూడా నాకు ఇష్టం అని తెలిపారు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ ముందు ఏ తమిళ్ డైరెక్టర్ తో చేస్తాడో చూడాలి. వెట్రిమారన్, అట్లీలలో ఎన్టీఆర్ ఎవరికీ ఛాన్స్ ఇస్తాడో ఎదురుచూడాలి.
Also Read : Vishwambhara : ‘విజృంభణం’ అంటూ రిలీజ్ డేట్ ఫై క్లారిటీ