NTR : ఎన్టీఆర్ పేరు మార్చుకున్నాడా..?
- By Sudheer Published Date - 06:47 PM, Fri - 16 August 24

చిత్రసీమ (Film Industry)లో నటి నటులు తమ పేర్ల ముందు పలు పేర్లను జత చేయడం లేదా..తీసేయడం..కొత్త పేర్లు యాడ్ చేయడం వంటివి చేస్తుంటారు. జాతకరీత్యా ఇలా మార్పులు , చేర్పులు చేస్తుంటారు. ఈ మధ్యనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్..తన పేరును మార్చుకున్నాడు. సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) గా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా తన పేరును మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్టీఆర్ కు ముందు జూనియర్ అనే టాగ్ ఎప్పటి నుండో ఉంది. అభిమానులు, సినీ ప్రముఖులు అలాగే పిలుస్తుంటారు. ఎన్టీఆర్ అంటే చాలామందికి తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరైనా టక్కున గుర్తుపడతారు..అంతలా ఆ పేరు ఫేమస్ అయ్యింది. అలాంటి ఆ పేరును ఎన్టీఆర్ మార్చుకున్నట్లు ప్రచారం అవుతుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొంతమంది మాత్రం తన కుమారుడు పెరుగుతున్నాడు..కొద్దీ ఏళ్లకు అతడు కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అప్పుడు అతడ్ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు కాబట్టి..ముందుగానే ఎన్టీఆర్ తన పేరును మార్చుకున్నట్లు కాంతామణి అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఎన్టీఆర్ పేరు మార్పు అనేది మాత్రం చర్చ గా మారింది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర చేస్తున్నాడు. రెండు పార్ట్శ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే రీసెంట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో మూవీ కి శ్రీకారం చుట్టారు. అటు బాలీవుడ్ లో లోను వార్ మూవీ చేస్తున్నాడు.
Read Also : Study : ఆందోళనకరంగా వైద్య విద్యార్థుల మానసిక పరిస్థితి.. తాజా సర్వే