NTR : ఎన్టీఆర్ బర్త్ డే.. అక్కడ స్పెషల్ పార్టీ ప్లానింగ్..?
NTR RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాడు
- By Ramesh Published Date - 12:55 PM, Thu - 16 May 24

NTR RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాడు తారక్. కచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఫుల్ మాస్ ట్రీట్ అందించడం పక్కా అని గ్యారెంటీ ఇస్తున్నాడు. దేవర ఫస్ట్ పార్ట్ ని అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. అందుకు తగినట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ మరోపక్క హృతిక్ రోషన్ తో వార్ 2 కూడా చేస్తున్నాడు. వార్ 2 సినిమాలో నువ్వా నేనా అనే విధంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫైట్ ఉండనుంది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ కోసమే మరోసారి ముంబై వెళ్లాడని అంటున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కనిపించడంతో అది నిజమే అని అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదని టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉందని తెలిసిందే. తన బర్త్ డే పార్టీని ముంబైలో నిర్వహించేలా ప్లాన్ చేశాడట తారక్.
అందుకే బర్త్ డేకి ముందు ముంబై కి వెళ్లాడని అంటున్నారు. ముంబై లోనే బాలీవుడ్ స్టార్స్ తో ఎన్టీఆర్ బర్త్ డే బాష్ ఉంటుందని చెబుతున్నారు. అదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో బాలీవుడ్ హీరోగా మారినట్టే లెక్క. రీసెంట్ గా బాలీవుడ్ ఒక ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ తన సతీమణితో వెళ్లాడు. సో తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో అడుగులు వేస్తున్నాడని చెప్పొచ్చు.
Also Read : Shruthi Hassan : శృతి హాసన్ డిమాండ్ అలా ఉంది.. ఆ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న అమ్మడు..!