HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr And Anr Fires On Bhookailas Director While Shooting Time

ANR – NTR : ఏఎన్నార్, ఎన్టీఆర్‌కి కోపం రావడంతో.. కాళ్ళ మీద పడ్డ దర్శకుడు..

తెలుగు దిగ్గజ నటులు ఏఎన్నార్(ANR), ఎన్టీఆర్‌(NTR) కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. అలా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో ఒకటి ‘భూకైలాస్‌’ (Bhookailas).

  • Author : News Desk Date : 01-09-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NTR and ANR Fires on Bhookailas Director while shooting time
NTR and ANR Fires on Bhookailas Director while shooting time

తెలుగు దిగ్గజ నటులు ఏఎన్నార్(ANR), ఎన్టీఆర్‌(NTR) కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. అలా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో ఒకటి ‘భూకైలాస్‌’ (Bhookailas). అప్పటి బడా నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్‌(AVM Productions) ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఎస్వీ రంగారావు, జమున కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేశారు.

ఈ సినిమాలోనే ఎన్టీఆర్ తొలిసారి రావణుడి పాత్ర పోషించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు నారదుడి పాత్రలో కనిపించారు. 1958లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని కె శంకర్ డైరెక్ట్ చేశారు. ఎడిటర్ గా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ కి ఇది రెండో సినిమా. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఇటు తెలుగులో ఏఎన్నార్, ఎన్టీఆర్‌లతో అటు కన్నడలో ‘రాజకుమార్’, ‘కళ్యాణ్ కుమార్’తో ఒకే సమయంలో తెరకెక్కించారు. ఇలా రెండో సినిమాకే ఇంతమంది అగ్రహీరోలను హ్యాండిల్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి.

మరి ఇలాంటి పెద్ద స్టార్స్ తో ఒకే సమయంలో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయిగా, అలాంటి ఒక సమస్యే దర్శకుడు శంకర్ కి ఎదురైంది. మూవీలో సముద్రం ఒడ్డున సూర్యోదయం సమయంలో చూపించే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరు నటించాలి.ఆ సీన్ చిత్రీకరణ కోసం హీరోలు ఇద్దరు మేకప్ వేసుకొని ఉదయం 5 గంటలు ముందే షూటింగ్ స్పాట్ లో ఉండాలి. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు ఏఎన్నార్, ఎన్టీఆర్ కి చెప్పగా వాళ్ళు ఓకే అన్నారు.

ఇక టైం కరెక్ట్ గా పాటించే వీరిద్దరూ ఐదు గంటలకు కన్నా ముందే అక్కడకి వచ్చేశారు. కానీ అక్కడ మూవీ యూనిట్ ఎవరు లేరు. ఉదయం 6 గంటలు అయినా ఎవరు రాలేదు. దీంతో హీరోలు ఇద్దరు తప్పు లొకేషన్ కి వచ్చాము అనుకుంటా అని భావించి వెనక్కి పయనం అయ్యారు. అదే సమయంలో డైరెక్టర్ కారులో నుంచి దిగాడు. దర్శకుడిని చూడగానే ఏఎన్నార్, ఎన్టీఆర్ కోపంతో ఊగిపోయారు. ఇక వారిని చూసిన దర్శకుడు పరిస్థితి అర్థమయి కారు దిగి దిగగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి కాళ్ళ మీద పడి.. పొరపాటు అయ్యింది. క్షమించండి అంటూ వేడుకున్నాడట. ఇక హీరోలు ఇద్దరు కూడా శాంతపడి చివరికి ఆ బీచ్ సీన్ ని పూర్తి చేశారు.

 

Also Read : Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన చేయబోయే కార్యక్రమాలు ఇవే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ANR
  • Bhookailas
  • K Shankar
  • ntr

Related News

Premabhishekam 45 Years

ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌

Premabhishekam 45 Years  అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాలలో ‘ప్రేమాభిషేకం’ ఒకటి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. విడుదలై నేటికి (ఫిబ్రవరి 18) సరిగ్గా 45 ఏళ్లు పూర్తయింది. ప్రేమ, త్యాగం మేళవింపుగా సాగే ఈ ప్రేమకథ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ 45 ఏళ్లు పూర్తి చేసు

  • Ntr Favorite Snacks

    NTR Favorite Snacks : ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్స్ అవేనట !!

Latest News

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

  • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd