Thammudu : పవన్ కళ్యాణ్ ను గట్టిగా వాడేసుకుంటున్న నితిన్..!!
పవన్ కళ్యాణ్ అంటే పడిచస్తాడు. అందుకే తన సినిమాలో పవన్ పాటో, సీనో, మేనరిజమో రిప్లికా చేస్తుంటాడు
- By Sudheer Published Date - 09:40 PM, Sat - 20 July 24

చిత్రసీమలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే నటి నటులకు , నిర్మాతలకు , దర్శకులకు ఇలా అందరికి ఎంతో అభిమానం..గౌరవం. పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలనీ..నిర్మించాలని..చిన్న క్యారెక్టర్ లో ఆయనతో కలిసి నటించాలని ఇలా ఎంతో మంది కోరుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే అగ్ర హీరోలు కూడా లేకపోలేదు. అలాంటి అభిమానుల్లో హీరో నితిన్ (Nithiin ) ఒకడు. తొలిప్రేమ సినిమా చూసి హీరో అవ్వాలని అనుకున్న నితిన్..అనుకున్నట్లే ఈరోజు హీరోగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే పడిచస్తాడు. అందుకే తన సినిమాలో పవన్ పాటో, సీనో, మేనరిజమో రిప్లికా చేస్తుంటాడు. అంతే కాదు గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలో ఏకంగా పవన్ కళ్యాణ్ సాంగ్ ను కూడా రీమేక్స్ చేసి అలరించాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ ఫిలిం ‘తమ్ముడు’ (Thammudu ) నే తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 70 % షూటింగ్ పూర్తి చేసుకోగా..రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశంలో దాదాపు 70 మంది ఫైటర్లు పాలు పంచుకుంటున్నారట. ఇది ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ అంటున్నారు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ పాటని రీమిక్స్ చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. ఆ పాటేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘తమ్ముడు’లో వయ్యారి భామ పాట చాలా పెద్ద హిట్. దాన్ని రీమిక్స్ చేస్తున్నారా..? లేక మరో సాంగ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాపర్‌గా వర్క్ చేస్తుండగా.. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also : Gujarat : క్లాస్ రూమ్‌లో కూలిన గోడ..పరుగులు పెట్టిన విద్యార్థులు