Niharika : మంచు మనోజ్ సరసన నిహారిక కొణిదెల.. మళ్ళీ హీరోయిన్‌గా రీఎంట్రీ.. ఈసారి హాట్‌గా..
ఆల్రెడీ 'వాట్ ది ఫిష్'(What The Fish) అనే ఓ సినిమాని మనోజ్ ప్రకటించాడు. తాజాగా వాట్ ది ఫిష్ సినిమాలో నిహారిక(Niharika) ఉన్నట్టు ప్రకటించారు.
- Author : News Desk
Date : 18-12-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
సినిమాలకి గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్(Manchu Manoj) దాదాపు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇటీవలే ఉస్తాద్(Ustaad) అనే ఓ షోని మొదలుపెట్టగా సినిమాలని కూడా లైన్ లో పెడుతున్నాడు. ఆల్రెడీ ‘వాట్ ది ఫిష్'(What The Fish) అనే ఓ సినిమాని మనోజ్ ప్రకటించాడు. వరుణ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. ఇందులో వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. వాట్ ది ఫిష్ సినిమాలో నిహారిక(Niharika) ఉన్నట్టు ప్రకటించారు. నేడు నిహారిక కొణిదెల పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి నిహారిక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో షార్ట్ డ్రెస్ లో నిహారిక హాట్ గా ఉంది.
గతంలో నిహారిక హీరోయిన్ గా పలు సినిమాలు చేసి పెళ్లి తర్వాత మానేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడాకులు అయిపోవడంతో మళ్ళీ హీరోయిన్ గా మొదలుపెట్టింది నిహారిక. అయితే ఈసారి ఇంత హాట్ గా కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇటీవలే నిహారిక ఓ వెబ్ సిరీస్ లో కూడా మెయిన్ లీడ్ చేసింది. మరి మనోజ్ – నిహారిక పెయిర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీస్ కేసు నమోదు.. అతని ఫ్యాన్స్ పై కూడా..