HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Niharika Help To Flood Effected Villages Like Pawan Kalyan

Niharika : బాబాయ్ బాటలో కూతురు.. బుడమేరు ముంపు గ్రామాలకు నిహారిక సాయం..

బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలోనే నిహారిక కూడా అలాగే హెల్ప్ చేసింది.

  • Author : News Desk Date : 07-09-2024 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Niharika Help to Flood Effected Villages like Pawan Kalyan
Pawan Kalyan Niharika

Niharika : ఇటీవల వచ్చిన వర్షాలకు వరదలు ఏర్పడి ఏపీ, తెలంగాణాలో అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అయితే వరద బాధితుల కోసం టాలీవుడ్ లోని అనేక సెలబ్రిటీలు ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ భారీగా విరాళాలు ప్రకటించింది. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్, గ్రామాలకు సాయంకు మెగా ఫ్యామిలీలోని హీరోలంతా కలిపి ఆల్మోస్ట్ 10 కోట్ల విరాళం ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమే కాక 400 గ్రామాలకు ఒక్కో గ్రామానికి లక్ష రూపాయల చొప్పున సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలోనే నిహారిక కూడా అలాగే హెల్ప్ చేసింది. బుడమేరు ముంపుతో ఇబ్బంది పడిన పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి 50 వేలు చొప్పున మొత్తం అయిదు లక్షలు విరాళంగా ప్రకటించింది.

ఈ మేరకు నిహారిక తన సోషల్ మీడియాలో.. బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారి చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నేను కూడా ఈ బృహత్కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలిపింది.

బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలో నిహారిక ఇలా సహాయం చేయడానికి ముందుకు రావడంతో అభిమానులు, నెటిజన్లు నిహారికని అభినందిస్తున్నారు. ఇటీవలే నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మంచి విజయం సాధించింది.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

 

Also Read : Allu Arha : వినాయక పూజ చేస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ.. క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Flood Effected Villages
  • Niharika
  • Niharika Konidela
  • Pawan Kalyan

Related News

Rakasa Movie Review

Rakasa Movie Review: సంగీత్ శోభన్ రాకాస మూవీ రివ్యూ

Niharika Konidela రుచికరమైన వంటకు సార్థకత చేకూరేది పద్ధతిగల వడ్డింపుతోనే. ఓ మోస్తరుగా వంట ఉన్నా కూడా వడ్డించే విధానం కుదిరితే నోటికి రుచిగా, కన్నులకు ఇంపుగా ఉంటుంది. కాబట్టి మంచిగా వండటమే కాదు.. రుచిగా వడ్డించడం కూడా కీలకమే. ఇదే సూత్రం సినిమాకి కూడా వర్తిస్తుంది. సినిమా బాగా తీయడంతో పాటు.. ఎంత బాగా ప్రమోట్ చేశాం అన్నది కూడా కీలకం. కంటెంట్ బాగున్న సినిమాకి సరైన ప్రమోషన్స్ లేక చతికిల

    Latest News

    • Jagan Padayatra 2.0 : జూలై నుంచే జగన్ పాదయాత్ర..

    • Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్

    • Hardik Pandya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య..అసలు ఏంజరిగిందంటే !!

    • RBI Repo Rate : వడ్డీ రేట్ల పై RBI కీలక అప్డేట్

    • Heart Attack : జగిత్యాల జిల్లాలో విషాదం .. గుండెపోటుతో మృతి చెందిన 9 ఏళ్ల విద్యార్థి

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd