Love Story : అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ తేల్చేసిన నిహారిక
Love Story : ప్రస్తుతం నిహారిక తన నిర్మాణ సంస్థ ద్వారా 'మ్యాడ్ మూవీ' ఫేమ్ సంగీత్ శోభన్ (డీడీ) తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి
- Author : Sudheer
Date : 17-05-2025 - 9:43 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నటి, నిర్మాత నిహారిక (Niharika ) కొణిదెల తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు ..“ఏ హీరోతో ఏ జానర్‌లో సినిమా తీయాలనుకుంటారు?” అని అడగ్గా, నిహారిక సరదాగా “బన్నీ(Allu Arjun)తో లవ్‌స్టోరీ తీయాలని ఉంది” అని తెలిపింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైథలాజికల్ మూవీ తీయాలనే అభిప్రాయం కూడా వెల్లడించింది.
Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో పాట వచ్చేస్తుందోచ్ !!
తాను దర్శకురాలిగా మారితే తొలి సినిమాగా రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తీస్తానని నిహారిక చెప్పారు. తనకు కథలు రాయడం, సినిమాల మీద ఆసక్తి ఎంతగానో ఉందని పేర్కొంటూ “ఒక రోజు డైరెక్టర్ అవ్వాలన్నది నా కల” అని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఫిల్మ్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. మెగా కుటుంబానికి చెందిన నిహారిక మాటలతో ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం నిహారిక తన నిర్మాణ సంస్థ ద్వారా ‘మ్యాడ్ మూవీ’ ఫేమ్ సంగీత్ శోభన్ (డీడీ) తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాతగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్న నిహారిక, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, భవిష్యత్తులో దర్శకురాలిగా మారే దిశగా నిహారిక అడుగులు వేస్తుండటం పరిశ్రమలో ఆమె స్థానం మరింత బలపడేలా చేస్తోంది.