#HHVM : ఆత్రుత ఆపుకోలేక ‘హరిహర వీరమల్లు’ కథ చెప్పేసిన నిధి అగర్వాల్
#HHVM : సినిమా కథ ఏంటి..? పవన్ రోల్ ఎలా ఉండబోతుంది..? వంటి కీలక వివరాలను మీడియా కు లీక్ చేసింది నటి నిధి
- By Sudheer Published Date - 10:10 PM, Wed - 28 May 25

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆరేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా జూన్ 12న పాన్ ఇండియా గా విడుదల కాబోతుంది. ఇక సినిమా విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. ఇటీవల చిత్ర బృందం గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించి మీడియా కు సినిమా వివరాలు వెల్లడించింది. ఈ సినిమా ప్రమోషన్లకు కూడా ప్రాధాన్యం ఇస్తూ, హీరోయిన్లు, నటీనటులు మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రోమోట్ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమా కథ ఏంటి..? పవన్ రోల్ ఎలా ఉండబోతుంది..? వంటి కీలక వివరాలను మీడియా కు లీక్ చేసింది నటి నిధి.
Mahanadu : కడుపునిండా భోజనాలు పెట్టడం టీడీపీకి అలవాటే..తెలుగు తమ్ముళ్లు సంతోషం
హరిహర వీరమల్లు కథ 17వ శతాబ్ద ఔరంగజేబు కాలంలో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో ఒక ధైర్యవంతుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్ర నిజ జీవిత క్యారెక్టర్‌ను, కొంత కల్పన జోడించి తీర్చిదిద్దామని హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల హిందీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ దొరల నుంచి దోచిన సొమ్మును పేదలకు పంచే వ్యక్తిగా కనిపిస్తాడు. కథలో కోహినూర్ వజ్రం కూడా కీలక అంశంగా ఉంటుంది. పవన్ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ అని నిధి పేర్కొన్నారు. ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉందని, ఇది తన కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అని తెలిపింది.
ముందుగా ‘హరిహర వీరమల్లు’ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో చిత్ర నిర్మాణ బాధ్యతలు ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నారు. దయాకర్ రెడ్డి అనే మరో నిర్మాతతో కలిసి రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.