Netizens Troll Samantha: సమంతపై నెటిజన్స్ ట్రోలింగ్.. మరో డివోర్స్ అంటూ!
కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ సందడి చేస్తోంది.
- By Balu J Published Date - 02:54 PM, Wed - 20 July 22

కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ సందడి చేస్తోంది. ప్రతి ఎపిసోడ్ కు కరణ్ జోహార్ విమర్శలను ఎదుర్కోవడం సర్వసాధారణమవుతోంది. ఫస్ట్ ఏపిసోడ్ లో అలియా భట్ కంటే రణ్‌వీర్ సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అతన్ని విమర్శించారు. ఆ తర్వాత సారా అలీ ఖాన్‌ను తగ్గించి, జాన్వీ కపూర్‌ను ఎలివేట్ చేసినందుకు కరణ్ ను “బిచీ అంకుల్” అని ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు కరణ్ జోహార్ కాకుండా టాలీవుడ్ బ్యూటీ సమంత టార్గెట్ అయ్యింది. తాజా ప్రోమోలో అక్షయ్ తన చేతుల్లో సమంతను పట్టుకొని షోలో సోఫా వద్దకు తీసుకెళ్లడం మనం చూస్తాము. అయితే ప్రేక్షకులకు అది నచ్చలేదట. దీంతో సమంతను విమర్శిస్తున్నారు.
“వాహ్! ఆమె (సమంత) రవీనా, ట్వింకిల్ (IYKYK)ని పోలి ఉన్నప్పటికీ, ఆ ఇద్దరు ఇబ్బందికరంగా వ్యవహరిస్తారని నేను భావిస్తున్నా. ఈ కార్యక్రమం తర్వాత సమంత తన పేరును కాపాడుకుంటుందని ఆశిస్తున్నా.. అని ఒకరు కామెంట్ చేయగా, “త్వరలో మరో విడాకులు వస్తాయని నేను అనుకుంటున్నాను” మరి నెటిజన్ మండిపడ్డారు. సమంత అక్షయ్ తో క్లోజ్ గా మూవ్ కావడం కూడా కొందరికీ నచ్చలేదు. ఎపిసోడ్ ప్రసారం కాకముందే.. అక్షయ్ కుమార్, సమంతల కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఓ కమర్షియల్ యాడ్ లో సమంత, అక్షయ్ నటించనున్నట్టు సమాచారం కూడా. కరణ్ వివాహం గురించి సమంతను ప్రశ్నించగా, “సంతోషకరమైన వివాహాలకు మీరే కారణం” అని సమంత సెటైర్లు వేసింది. మొత్తానికి కరణ్ ఏడో ఏపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారనుంది.