Manchu Vishnu : మంచు విష్ణు సంచలన పోస్ట్.. తమ్ముడి కోసమేనా ?
బహుశా తన తమ్ముడు మంచు మనోజ్‌కు సందేశం ఇచ్చేందుకే మంచు విష్ణు(Manchu Vishnu) ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
- By Pasha Published Date - 09:16 AM, Thu - 2 January 25

Manchu Vishnu : న్యూఇయర్ వేళ మంచు విష్ణు పెట్టిన సంచలన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్టులో ఆయన ఏం చెప్పదలిచారు ? ఎవరికి చెప్పదలిచారు ? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ‘‘జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టంలో మీ పక్కనే ఉండే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కలలను నెరవేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ప్రేమ, పాజిటివిటీ మాత్రమే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్! జై శ్రీ రామ్!’’ అంటూ తన ట్వీట్‌లో మంచు విష్ణు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బహుశా తన తమ్ముడు మంచు మనోజ్‌కు సందేశం ఇచ్చేందుకే మంచు విష్ణు(Manchu Vishnu) ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మంచు మనోజ్ ప్రతీ విజయంలో కుటుంబం పాత్ర కూడా ఉందని నెటిజన్లు అంటున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలోని వారంతా భేషజాలను వీడి ఏకం కావాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఆస్తిపాస్తుల కంటే ఐకమత్యమే బలమైందని, దానివల్లే కుటుంబాలకు విలువ పెరుగుతుందని చెబుతున్నారు.
Hard lessons were learnt, hopes are carried forward. Family is everything, and believing in your dreams is just as important. Never forget the loved ones who stand beside you through every moment of life.
Here’s to only positivity and love. Har Har Mahadev! Jai Sri Ram! pic.twitter.com/OEVbAkPHSI
— Vishnu Manchu (@iVishnuManchu) January 1, 2025
Also Read :Owaisis Plea : ‘ప్రార్థనా స్థలాల చట్టం’.. ఇవాళ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్ విచారణ
జల్‌పల్లి వద్ద చిట్టడవిలోకి వెళ్లి..
జల్‌పల్లి అటవీప్రాంతం పక్కనే మంచు విష్ణు ఇల్లు ఉంది. అక్కడ నెమళ్లు, జింకలు, ఇతర వన్యప్రాణులు ఉంటాయి. విష్ణుకు సంబంధించిన మేనేజర్ కిరణ్ మరో ఇద్దరితో కలిసి జల్‌పల్లి వద్ద చిట్టడవిలోకి వెళ్లి అడవిపందిని వేటాడి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది పాత వీడియో అని, ఇప్పుడు వైరల్ అయ్యిందని అంటున్నారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి స్పష్టంచేశారు. అది పాత వీడియోనే అని చెప్పారు. జల్‌పల్లిలోని మంచు టౌన్‌షిప్‌లో మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ గత పదిహేను సంవత్సరాలుగా నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపధ్యంలోనే ఈ వీడియో బయటకు వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే వివాదాల నేపధ్యంలో మంచు విష్ణు, మంచు మనోజ్‌లను పోలీసులు బైండోవర్ చేశారు. అప్పటి నుంచి వారు గొడవలకు దూరంగా ఉంటున్నారు.