Kangana On Aamir Khan: “లాల్ సింగ్ చద్దా”పై నెగెటివిటీ అమీర్ ఖాన్ సృష్టే : కంగన
అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈనేపథ్యంలో దాని చుట్టూ సమస్యలు ముసురు కుంటున్నాయి.
- By Hashtag U Published Date - 09:15 AM, Thu - 4 August 22
అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈనేపథ్యంలో దాని చుట్టూ సమస్యలు ముసురు కుంటున్నాయి. కొంత మంది ట్రోలర్స్ అమీర్ ఖాన్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు.తను ఎప్పుడో మాట్లాడిన మాటలను తెరమీదికి తీసుకొచ్చి హిందుత్వ వ్యతిరేక వాదిగా ముద్ర వేస్తున్నారు. “బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా” అంటూ.. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.”లాల్ సింగ్ చడ్డా మూవీపై వస్తున్న ట్రోల్స్, జరుగుతున్న నెగెటివ్ ప్రచారం అమీర్ ఖాన్ తెలివిగా సృష్టించుకున్నవే. ప్రతికూల ప్రచారం జరుగుతోందనే టాక్ కు ఆయనే మాస్టర్ మైండ్. దీన్ని బూచిగా చూపించి ఇండియాలో అసహనం పెరిగిందనే ముద్రవేసే ప్రయత్నం లో కొందరు ఉన్నారు” అని కంగనా ఇన్ స్టాగ్రామ్ వేదికగా కామెంట్ చేశారు.
“ఈ ఏడాది ఏ ఒక్క హిందీ సినిమా కూడా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దేశ సంస్కృతిని ప్రతిబింబించే కథతో , లోకల్ ఫ్లేవర్ తో వచ్చిన దక్షిణాది సినిమాలు మాత్రమే మెరిశాయి. ఇటువంటి తరుణంలో ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తీసుకొస్తున్న లాల్ సింగ్ చద్దా కూడా సఫలం కాకపోవచ్చు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇండియాలో అసహనం పెచ్చుమీరిందనే అంశాన్ని తెరపైకి తేవడం సబబు కాదు. హిందీ సినిమాలు తీసే ముందు ప్రజల నాడిని పట్టి చూడాల్సి ఉంటుంది. హిందూ, ముస్లింలతో ముడిపడిన ఇష్యూ కాదు ఇది. హిందువులను తప్పుగా చూపిస్తూ ఆమీర్ ఖాన్ తీసిన పీకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయాన్ని మర్చి పోకూడదు. మతం, సైద్ధాంతిక భావజాలంతో సినిమాలకు సంబంధం లేదు. యాక్టింగ్ బాగా లేకున్నా.. స్టోరీ బాగా లేకున్నా సినిమాలు నడవవు” అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.
అమీర్ ఖాన్ ను వెంటాడుతున్న గత వ్యాఖ్యలు ఇవి..
అమీర్ ఖాన్.. ఫస్ట్ టైం సత్యమేవ జయతే అనే టెలివిజన్ షో చేశారు. సమాజంలో ఉన్న అసమానతలను ఆ షో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సామాజిక రుగ్మతలపై తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే.. దేవుళ్లకు చేసే క్షీరాభిషేకాలపై విమర్శలు చేశారు. శివలింగానికి క్షీరాభిషేకం చేసే బదులు ఆ పాలను పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వాడవచ్చుగా అంటూ.. సత్యమేవ జయతే షో వేదికగా చెప్పారు. దీంతో అప్పట్లో హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి. అమీర్ ను విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. అయితే ఇవే సంఘాలు తాజాగా అమీర్ పై ఆయన లేటెస్ట్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా మరో సారి యుద్దాన్ని ప్రకటించాయి.
అమీర్ ఏమంటున్నారు ?
అమీర్ స్పందిస్తూ.. తన సినిమాను బాయ్ కాట్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని అంటున్నారు. అది అవాస్తవం. అందుకు బాధ కలుగుతోంది. వాళ్ల మనసుకు అలా అనిపించి ఉండవచ్చు. కానీ నేను ఈ దేశాన్ని ఇష్టపడతాను. దయచేసి నా సినిమాను ఆపాలని చూడకండి అంటూ రిక్వస్ట్ చేశారు అమీర్. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించారు.
Related News
Rahul Gandhi : మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: మరో వివాదం(dispute)లో చిక్కుకున్నారు కాంగ్రెస్(Congress)అగ్రనేత రాహుల్ గాంధీ. ఇటీవల రాహుల్ గాంధీ(Rahul Gandhi) యూనివర్శిటీ హెడ్ల ఎంపిక(Selection of University Heads) ప్రక్రియపై ప్రశ్నలు సంధించారు. అయితే దీనిపై తమ వ్యతిరేకతను తెలుపూతూ..పలు యూనివర్సటీల వైస్ చాన్సలర్లు, మాజీ వీసీలతో సహా 181 మంది విద్యావేత్తలు తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వారు నియామక ప్రక్రియకు సంబంధించి అబద్ధాలు ప్రచారం చేస్తున�