Nayanthara: షారుఖ్ ఖాన్‌తో బాలీవుడ్ అరంగేట్రం గురించి నయనతార ఏమన్నారో తెలుసా?
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన నయనతార హారర్ చిత్రం కనెక్ట్‌కి ప్రస్తుతం మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ పై నటి ఆనందం వ్యక్తం చేసింది.
- By Hashtag U Published Date - 01:32 PM, Mon - 2 January 23
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన నయనతార హారర్ చిత్రం కనెక్ట్‌కి ప్రస్తుతం మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ పై నటి ఆనందం వ్యక్తం చేసింది. “కనెక్ట్ అనేది ఒక గొప్ప అనుభవం. ప్రేక్షకులు పెద్ద స్క్రీన్‌పై ఈ హారర్ చిత్రాన్ని చూసే థ్రిల్‌ను ఇష్టపడుతున్నారు” అని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.త్వరలో విడుదల కానున్న షారుక్ ఖాన్ మూవీ జవాన్ లోనూ నయనతార హీరోయిన్ గా కనిపించనున్నారు. తద్వారా ఆమె బాలీవుడ్ లో తన కెరీర్ కు శ్రీకారం చుట్టనున్నారు.
ఈసందర్భంగా తన బాలీవుడ్ అరంగేట్రం సహా అనేక విషయాల గురించి నయనతార మనసు విప్పి మాట్లాడింది.
* కనెక్ట్‌ని హిందీలో ఎందుకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు?
నయనతార : ” మూవీ ఇండస్ట్రీలో చాలా పెద్ద మార్పులు జరుగుతున్నాయి. క్రాస్ ఓవర్ మరియు పాన్ ఇండియన్ సినిమాలు పెరుగుతున్నాయి. ఈ మార్పు.. చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అనే తేడా లేకుండా జరుగుతోంది. భారతీయులు, నార్త్ మరియు సౌత్ అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ప్రేక్షకులు మంచి చిత్రాలను మాత్రమే అంగీకరిస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు మంచి కంటెంట్‌ని చూడాలనుకుంటున్నారు. హిందీ ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి కనెక్ట్ అనేది నిజంగా మంచి చిత్రం అని మేము భావించాము. కనెక్ట్ అనేది దేశంలో ఎక్కడైనా ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది.”
* 20ఏళ్ల సినీ ప్రయాణం గురించి చెప్పండి
నయనతార : నటిగా 20 ఏళ్లు చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం చాలా ‘బాగుంది’. “ఏవైనా తప్పులు, మంచి దశలు మరియు చెడు దశలు అన్నీ ఈ జర్నీలో భాగం. ఇవన్నీ జీవితంలో నేర్చుకోవడం లాంటివి. పరిశ్రమలో చాలా కాలం నిలబడటం అంత సులభం కాదు. కానీ ప్రేక్షకుల ప్రేమ వల్ల ఇలా నిలబడగలిగాను.”
* కనెక్ట్ మూవీ హిందీ డబ్బింగ్ ఆలోచన ఎలా వచ్చింది ?
నయనతార : ” ఇండస్ట్రీలో భారీ మార్పు వచ్చింది. నిజంగానే సౌత్ లోనూ కొన్ని మంచి హిందీ సినిమాలు నడుస్తున్నాయి. అవి దేశవ్యాప్తంగానూ అద్భుతంగా వర్క్ అవుట్ అవుతున్నాయి. ఈ మార్పు నాలో విశ్వాసాన్ని కలిగించింది. బహుశా ఇతర రాష్ట్రాల్లో కూడా “కనెక్ట్” మూవీ పని చేయవచ్చు అని భావించా. అందుకే ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ తీసుకొచ్చాము.”
* మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హిందీ సినిమా?
నయనతార : నా ఆల్ టైమ్ ఫేవరెట్ హిందీ సినిమా కుచ్ కుచ్ హోతా హై.”షురువాత్ కైసే హోతీ హై. షాహిద్ థోడి బోరింగ్ లాగే but pooja.. షురువాత్ హమేషా పూజా సే హి హోతీ హై” (ప్రారంభం ఎలా ఉంటుంది” అని చెప్పింది. నేను నా రోజును పూజ మరియు ప్రార్థనతో ప్రారంభిస్తాను.)అని చెప్పింది. ఆమె హిందీలో ఇంకా ఇలా చెప్పింది.. “నేను చాలా హిందీ సినిమాలు చూశాను. నాకు చాలా ఇష్టమైన హిందీ మూవీస్ కొన్ని ఉన్నాయి. నా ఆల్-టైమ్ ఫేవరెట్స్ కుచ్ కుచ్ హోతా హై, కభీ కుషీ కభీ ఘమ్. నేను నా మానసిక స్థితిని బట్టి సినిమాలు చూస్తాను, కానీ నేను విచారంగా ఉంటే.. నా ఆల్-టైమ్ ఫేవరెట్ కుచ్ కుచ్ హోతా హైని చూడటం నాకు చాలా ఇష్టం.”
*షారుఖ్ తో జోడీగా బాలీవుడ్ ఎంట్రీపై ఏమంటారు?
నయనతార : “నాకు పూర్తి స్థాయి హిందీ సినిమా లేదా సరైన డబ్బింగ్ హిందీ సినిమా చేసే అవకాశం రాలేదు. అలాగే, ఇంతకుముందు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, ఈ రోజు అది మారిపోయింది మరియు పరిస్థితిని బట్టి మనం మారాలి”
Related News
Kiara Advani : అలాంటి సినిమాలే చేస్తా అంటున్న కియారా.. ఆ రెండు సినిమాలతో టాప్ లేపేస్తుందా..?
Kiara Advani బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ లకు ధీటుగా స్టార్ రేంజ్ కొనసాగిస్తుంది అందాల భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అంటోల్డ్ స్టోరీతో లైం లైట్ లోకి