Chhaava: ఛావా మూవీపై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోదీ.. గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందంటూ!
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమాపై తాజాగా నరేంద్ర మోడీ స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
- By Anshu Published Date - 01:30 PM, Sat - 22 February 25

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ఛావా. మరాఠా రాజు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ చత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా ఇటీవల ఫిబ్రవరి 14న గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి షో కే హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ సినిమా విడుదల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలామందికి మహారాజు శంభాజీ గురించి తెలియదు.
కానీ ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తో పాటు రష్మిక మందన,అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్ కు చెందిన దినేష్ విజన్ నిర్మించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు. 2025 లో రూ. 200 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఛావా సినిమా రికార్డు సృష్టించింది. ఛావా చిత్రం ప్రస్తుతం 2025 లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. కాగా ఛావా సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ సినిమాపై స్పందించారు. నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఛావా సినిమా ప్రశంసలు కురిపించారు. ఛావా సినిమా ప్రస్తుతం అంతటా వినిపిస్తోందని మోదీ అన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించింది. మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది అని మోదీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.