Nani Saripoda Shanivaram : నాని అక్కడ స్ట్రాంగ్ అవుతున్నాడా..?
మిగతా అన్ని చోట్ల ఏమో కానీ తమిళంలో కూడా సరిపోదా కు మంచి వసూళ్లు వస్తున్నట్టు తెలుస్తుంది. నాని సరిపోదా శనివారం (Saripoda Shanivaram) కు ఇప్పటివరకు తమిళ్ లోనే 10
- Author : Ramesh
Date : 03-09-2024 - 4:31 IST
Published By : Hashtagu Telugu Desk
న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం లాస్ట్ థర్స్ డే రిలీజైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్జే సూర్య ప్రతి నాయకుడిగా నటించారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. నాని దసరా తర్వాత చేసిన మాస్ అండ్ కమర్షియల్ మూవీగా సరిపోదా శన్వీఅరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.
ఐతే నాని సరిపోదా శనివారం తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజైంది. తెలుగులో సూపర్ కలెక్షన్స్ (Collections) తో దూసుకెళ్తుంది. ఐతే మిగతా అన్ని చోట్ల ఏమో కానీ తమిళంలో కూడా సరిపోదా కు మంచి వసూళ్లు వస్తున్నట్టు తెలుస్తుంది. నాని సరిపోదా శనివారం (Saripoda Shanivaram) కు ఇప్పటివరకు తమిళ్ లోనే 10 కోట్ల దాకా వచ్చినట్టు తెలుస్తుంది.
నాని (Nani) తమిళ్ లో కెరీర్ స్టార్టింగ్ లోనే వెప్పం అనే సినిమా చేశాడు. ఆ తర్వాత ఈగ అక్కడ నాన్ ఈ గా రిలీజైంది. నాని కాన్ స్టంట్ గా తెలుగులో సక్సెస్ లు అందుకుంటున్నాడు. రోజు రోజుకి అతని గ్రాఫ్ పెరుగుతుంది. ఐతే ఇప్పుడు నాని ఖాతాలో కోలీవుడ్ కూడా చేరిందని చెప్పొచ్చు. అక్కడ ఆడియన్స్ కూడా నాని సినిమాను ఇష్టపడుతునారు.
సరిపోదా శనివారం తమిళ్ లో సక్సెస్ అవ్వడానికి మరో రీజన్ ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించడమే. అంతేకాదు చెన్నై చిన్నది ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించింది. అందుకే తమిళ ప్రేక్షకులు దాన్ని ఓన్ చేసుకున్నారు. ఇప్పటివరకు నాని సరిపోదా శనివారం 62 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టేస్తుంది. చూస్తుంటే నాని మరోసారి 100 కోట్ల మార్క్ కొట్టేలా ఉన్నాడు.