Nani : కల్కి 2 లో నాని.. ఇలా షాక్ ఇచ్చాడేంటి..?
సినిమాలో మృణాల్ థాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వారు కూడా క్యామియో అప్పియరెన్స్ ఇచ్చి
- By Ramesh Published Date - 04:51 PM, Mon - 26 August 24

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ లో నటించిన సినిమా కల్కి 2898AD (Kalki 2898AD). ఈ సినిమాలో అమితాబ్, దీపిక పదుకొనె, కమల్ హాసన్ కూడా భాగం అయ్యారు. జూన్ లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఐతే సినిమాలో మృణాల్ థాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వారు కూడా క్యామియో అప్పియరెన్స్ ఇచ్చి అలరించారు.
ఇదే వరుసలో నాని కూడా కల్కిలో భాగం అవుతాడని అందరు అనుకున్నారు. రిలీజ్ ముందు చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ కల్కి చూశాక నాని ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు.
ఇక కల్కిలో కృష్ణుడిగా ఫేస్ కనిపించకుండా చేసింది నాని (Nani)నే అని కూడా హంగామా చేశారు. కానీ అది అతని కాదని ఆ తర్వాత తెలిసింది. ఐతే కల్కి 2 లో నాని ఏమైనా ఉంటాడా అంటే ఆమధ్య నాగ్ అశ్విన్ అవును కల్కి 2లో కొన్ని సర్ ప్రైజ్ క్యామియోలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఐతే అది నాని గురించేమో అని అందరు అనుకున్నారు.
Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్ తో మారుతి.. కాంబో ఫిక్స్ అయినట్టేనా..?
కానీ సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో నాని కల్కి పై క్లారిటీ ఇచ్చారు. కల్కి 2 లో తాను ఉండే ఛాన్స్ లేదని చెప్పారు నాని. కల్కి 2 లో తాను ఉండనని.. ఇప్పటివరకు అయితే తనతో ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు నాని. ఇక సరిపోదా శనివారం (Saripoda Shanivaram) సినిమాతో మాత్రం కచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటామనే నమ్మకాన్ని వెల్లబుచ్చారు నాని. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సరిపోదా శనివారం సినిమాలో నాని సరన్స ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.