Nitin Nani Friendship: నితిన్ హీరో.. నాని అసిస్టెంట్ డైరెక్టర్
నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, నాని హాయ్ నాన్న సినిమాలు 24 గంటల తేడాతో విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్ నానితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు
- By Praveen Aluthuru Published Date - 03:28 PM, Tue - 5 December 23

Nitin Nani Friendship: నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, నాని హాయ్ నాన్న సినిమాలు 24 గంటల తేడాతో విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్ నానితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. నితిన్ హీరోగా నటించిన సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సమయంలో తమ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను నితిన్ గుర్తు చేసుకున్నారు.
”నేను అల్లరి బుల్లోడు సినిమా చేసినప్పుడు నాని అసిస్టెంట్ డైరెక్టర్. అప్పట్లో సెట్స్‌లో బాగా మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు నాని నన్ను నితిన్ అని పిలిచేవాడు. అప్పట్లో హీరోలను బాబూ..బాబూ అని పిలుస్తుంటారు కాబట్టి నాని నన్ను నితిన్ అని పిలవడం నాకు నచ్చింది. ఒకానొక సమయంలో నానిని ఓ నిర్మాత పక్కకు పిలిచి హీరోని పేరు పెట్టి పిలవవద్దని వార్నింగ్ ఇచ్చారు. కానీ నేను కాల్ చేసి నన్ను నితిన్ అని పిలవమని అడిగాను అని ఇలా నానితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నితిన్. నానితో బాక్సాఫీస్ పోటీ ఇదే మొదటిది కాదని నితిన్ అంటున్నారు. ఇంతకుముందు నాని-నితిన్ నటించిన సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. కాకపోతే ఈ రెండూ ఫ్లాప్ అయ్యాయని, అయితే ఈసారి ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, హాయ్ నాన్న సినిమాలు రెండూ సక్సెస్ అవుతాయని అంటున్నారు.
Also Read: Lucky Zodiac Signs: జనవరి 1నుంచి ఈ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. లక్ష్మీ ఇంట్లో తాండవ మాడాల్సిందే?