Pooja Hegde With Nag: నాగ్-పూజాహెగ్డే కలిశారు.. ఎందుకో తెలుసా?
పూజాహెగ్డే, సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) కలిశారు.
- Author : Balu J
Date : 09-01-2023 - 4:22 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) 2022 లో పెద్ద హీరోల పక్కన నటించినప్పటికీ.. సక్సెస్ రేటులో మాత్రం వెనుకబడిపోయింది. ఈ బ్యూటీకి 2022 ఏమాత్రం కలిసిరాలేదు. ఒకవైపు పరాజయాలు, మరోవైపు గాయాలు బాధించాయి. ప్రస్తుతం హీరోయిన్ పూజాహెగ్డే, సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) కలిశారు. ఇద్దరూ కలిసి కెమెరా ముందుకొచ్చారు. చక్కగా నటించారు. అయితే వీరిద్దరి కలిసింది సినిమా కోసం కాదంట.
ఎలాంటి ప్రకటన లేకుండా ఓ స్టార్ హీరో, ఓ స్టార్ హీరోయిన్ ఎలా కలిశారనే ఆశ్చర్యపోకండి. వీళ్లు కలిసింది ఓ యాడ్ షూటింగ్ కోసం. అవును.. ఓ కూల్ డ్రింక్ యాడ్ కోసం నాగ్-పూజాహెగ్డే (Pooja Hegde) కలిశారు. ఇద్దరితో యాడ్ షూటింగ్ కూడా ముగిసింది. నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పూజాహెగ్డేకు ఇదే తొలిసారి.
ఇంతకుముందు అఖిల్ తో ఆమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేసింది. ప్రస్తుతం పూజాహెగ్డే (Pooja Hegde) వరుస సినిమాలతో బిజీగా ఉంది. మహేష్ బాబు మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించబోతోంది ఈ బ్యూటీ.
Also Read: Keerthy Suresh Vacation: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న కీర్తి సురేష్.. పిక్స్ వైరల్!