Bangarraju: ఓటీటీలో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘బంగార్రాజు’ రిలీజ్
'జీ 5' ఓటీటీ లక్ష్యం ఒక్కటే... వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా... ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడమే 'జీ 5' ముఖ్య ఉద్దేశం.
- By Balu J Published Date - 11:01 AM, Thu - 10 February 22
‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడమే ‘జీ 5’ ముఖ్య ఉద్దేశం. ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్లు, కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తోంది ‘జీ 5’. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ‘బంగార్రాజు’ను విడుదల చేయడానికి సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’… అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగార్జున నిర్మాత. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది ‘జీ 5’. ఫిబ్రవరి 18 నుంచి ‘జీ 5’ ఓటీటీలో సినిమా అందుబాటులోకి రానుంది.
అక్కినేని ఫ్యామిలీ – అన్నపూర్ణ స్టూడియోస్‌కు, ‘జీ 5’కు మధ్య చక్కటి అసోసియేషన్ ఉంది. ఆల్రెడీ ‘జీ 5’లో వీక్షకులను అలరిస్తున్న ‘లూజర్ 2’ ఒరిజినల్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. అఖిల్ ‘హలో’ను, నాగచైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలను ఓటీటీలో ‘జీ 5’ విడుదల చేసింది. ఆ రెండూ సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం మీద రూపొందాయి. ఇటీవల ‘లూజర్ 2’తో వీక్షకుల మనసులను మరోసారి గెలుచుకుంది ‘జీ 5’. ఈ నెల 11న అక్కినేని మనవడు సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీలో విడుదల చేస్తోంది.
Related News
Tillu Square OTT: టిల్లుగాడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Tillu Square OTT: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల తార అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రూ.125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని అందుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్ధు, అనుపమలతో పాటు నేహా శెట్టి, ప్రియాం�