Nagababu : ‘అల్లు’ అంటూనే..బన్నీ ఫై నాగబాబు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు..?
ఈ సినిమా ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది కాదు.. మా అబ్బ సొత్తు ఏమి కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాత సామ్రాజ్యం కాదు
- By Sudheer Published Date - 02:03 PM, Tue - 6 August 24

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ..మరోసారి అల్లు అర్జున్ (Allu Arjun) ను టార్గెట్ చేశాడా..? ‘అల్లు’ అంటూనే పరోక్షంగా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారా..? ప్రస్తుతం నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఇదే చర్చ నడుస్తుంది. నిహారిక కొణెదల నిర్మాణంలో కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu) అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యాదు వంశీ డైరెక్ట్ చేయగా.. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నిన్న సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అలాగే అడివి శేష్ , హైపర్ ఆది తదితరులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
జనరల్ గా మెగా ఫ్యామిలీ మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ వింటూ ఉంటాం.. వీళ్ళు తప్ప ఇంకెవరూ ఉండరు,.. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ మీద కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే వారిని చాలా మందిని చూశాం.. మాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు.. “ఈ సినిమా ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది కాదు.. మా అబ్బ సొత్తు ఏమి కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాత సామ్రాజ్యం కాదు.. ఇక అలాగే అక్కినేని ఫ్యామిలీనో, నందమూరి ఫ్యామిలీనో కాదు…’అల్లు’ ఇలా ఎవరిది కాదు ఈ ఇండస్ట్రీ అందరిదీ” అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. నాగబాబు ప్రస్తుతం జరుగుతున్న ఆరోపణలపై స్పందించారు తప్పితే అల్లు ఫ్యామిలీ కానీ , అల్లు అర్జున్ ఫై కానీ ఎలాంటి విమర్శలు , ఆరోపణలు చేయలేదని..కావాలనే కొంతమంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ..అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య దూరాన్ని పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Wayanad Landslides : నది వరద ప్రవాహం లో కొట్టుకు వస్తున్న శవాలు