Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణం చేసాక మొదటిసారి పవన్ ని కలిసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..
నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాక మొదటి సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు.
- By News Desk Published Date - 10:15 AM, Thu - 3 April 25

Nagababu : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నిన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడి(MLC)గా ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నాగబాబు. బుధవారం నాడు శాసన మండలి చైర్మన్ సమక్షంలో నాగబాబు ప్రమాణం చేసి, తన బాధ్యతలను చేపట్టారు.
నాగబాబు ఎమ్మెల్సీ అవ్వడంతో కార్యకర్తలు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే నాగబాబు సీఎం చంద్రబాబు నాయుడుని, మెగాస్టార్ చిరంజీవిని కలవగా వారు అభినందించారు.
నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాక మొదటి సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం ఆఫీస్ లో నేడు ఉదయం నాగబాబు పవన్ కళ్యాణ్ ని మీట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాక నాగబాబు మొదటిసారి పవన్ ని కలిసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు. ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ @NagaBabuOffl గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/GEN5lWtwMu
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2025
Also Read : MLC Nagababu : తమ్ముడిని సన్మానించిన అన్నయ్య