Naga Chaitanya : తండేల్ బుజ్జి తల్లి అప్డేట్.. డీఎస్పీ రంగంలోకి దిగాడోచ్..!
Naga Chaitanya ఈ సాంగ్ గురించి ఒక స్పెషల్ అనౌన్స్ మెంట్ వీడియో చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఆయన స్టూడియోలో సింగర్ జావీద్ తో కలిసి బుజ్జి తల్లి సాంగ్ ట్యూన్ వినిపించారు. పూర్తి సాంగ్ గురువారం సాయంత్రం
- By Ramesh Published Date - 04:34 PM, Wed - 20 November 24

నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో వస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నాగ చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తండేల్ (Thadel) సినిమాను ఫిబ్రవరి మొదటి వారం రిలీజ్ లాక్ చేయగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ బుజ్జి తల్లి (Bujji Thalli)ని నవంబర్ 21 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
ఐతే ఈ సాంగ్ గురించి ఒక స్పెషల్ అనౌన్స్ మెంట్ వీడియో చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఆయన స్టూడియోలో సింగర్ జావీద్ తో కలిసి బుజ్జి తల్లి సాంగ్ ట్యూన్ వినిపించారు. పూర్తి సాంగ్ గురువారం సాయంత్రం రాబోతుంది. తండేల్ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ యాక్షన్ మూవీగా ఇది వస్తుంది.
సంథింగ్ స్పెషల్ అన్నట్టే..
ఈ సినిమాలో చైతన్య (Naga Chaitanya) లుక్ యాక్షన్ అంతా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాతో తప్పకుండా అక్కినేని హీరోకి భారీ హిట్ ఇస్తుందని అంటున్నారు. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే అది సంథింగ్ స్పెషల్ అన్నట్టే లెక్క. ఈమధ్యనే అమరన్ తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి తండేల్ తో మరో సక్సెస్ కు రెడీ అవుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కలిసి ఇదివరకే లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. హిట్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కూడా అదే హిట్ మేనియా కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Venkatesh : డీజే టిల్లు తో వెంకీమామ..?