Bangarraju : నీ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు నాన్నా!
నాగ చైతన్య, నాగార్జున అక్కినేని నటించిన ‘బంగార్రాజు’ మూవీ భారీ అంచనాలు పెంచేస్తోంది. తెలుగు రాబోయే ప్రతిష్టాత్మక మూవీల్లో ఇదొకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశారు.
- Author : Balu J
Date : 09-11-2021 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
నాగ చైతన్య, నాగార్జున అక్కినేని నటించిన ‘బంగార్రాజు’ మూవీ భారీ అంచనాలు పెంచేస్తోంది. తెలుగు రాబోయే ప్రతిష్టాత్మక మూవీల్లో ఇదొకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా చేశారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఆ సినిమా, నాగ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో ఆయన పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. దాంతో ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన సినిమా చేస్తుండటం విశేషం.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘బంగార్రాజు’ స్వర్గంలో రంభ .. ఊర్వశి .. మేనకలతో కలిసి హుషారెత్తించే సాంగ్ ఇది. నాగార్జున ఆలపించిన లడ్డుండ చిత్రానికి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా, సంగీతం: అనూప్ రూబెన్స్. అక్కినేని నాగార్జున ఈ సినిమాలో తన గాత్రం, నటన, డాన్స్ తో మనల్ని ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ నటిస్తున్నారు. కాగా నాగార్జున, నాగ చైతన్య ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు. తండ్రి పాడిన పాటను ప్రశంసిస్తూ ‘‘నీ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు నాన్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
Nana no one can match your swag !
Here’s the first lyrical #Laddunda from #Bangarraju https://t.co/xdqepkq4S9@iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_@lemonsprasad @zeemusiccompany— chaitanya akkineni (@chay_akkineni) November 9, 2021
బంగార్రాజుతో పాటు, నాగ చైతన్య రెండు ఆసక్తికరమైన చిత్రాలను 2022లో విడుదల చేస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రీకరణను ముగించిన తర్వాత, చై బంగార్రాజుతో బిజీగా ఉన్నారు. అతనికి విక్రమ్ కుమార్ దర్శకత్వం కూడా ఉంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్ కూడా నటించారు.