Naga Chaitanya : నాగచైతన్య కు ఆ హీరోయిన్ అంటే చాల భయమట !!
Naga Chaitanya : తాజాగా చైతూ స్వయంగా చెప్పిన ఓ విషయం మరోసారి ఆయనను వార్తల్లోకి తీసుకువచ్చింది. తనకు ఓ హీరోయిన్ అంటే చాలా భయం అంటూ చెప్పిన విషయమే ఇప్పుడు వైరల్‌గా మారింది.
- Author : Sudheer
Date : 04-07-2025 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) పర్సనల్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సమంతతో పెళ్లి, ఆ తర్వాత విడాకులు, తాజాగా శోభిత ధూళిపాళ్లతో జరిగిన వివాహం అన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్‌గా మారినవే. అయితే తాజాగా చైతూ స్వయంగా చెప్పిన ఓ విషయం మరోసారి ఆయనను వార్తల్లోకి తీసుకువచ్చింది. తనకు ఓ హీరోయిన్ అంటే చాలా భయం అంటూ చెప్పిన విషయమే ఇప్పుడు వైరల్‌గా మారింది.
AP Skill Development : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కువైట్ జాబ్స్ ..త్వరపడండి !
రీసెంట్‌గా రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో గెస్ట్‌గా పాల్గొన్న నాగ చైతన్య, సాయి పల్లవితో నటించడానికి భయమేస్తుందని వెల్లడించారు. “నా భార్య కంటే సాయి పల్లవికే ఎక్కువగా భయపడతా. ఆమెతో డాన్స్ చేయాలన్నా, యాక్ట్ చేయాలన్నా ఒత్తిడిగా ఉంటుంది. ఆమె ఎంత ప్రొఫెషనల్‌గా పని చేస్తుందో చూస్తే భయం వేస్తుంది” అంటూ తెలిపారు. వీరిద్దరూ కలసి నటించిన ‘లవ్ స్టోరి’, తండేల్ సినిమాలు మంచి విజయాలు అందుకున్నప్పటికీ, ఆమె టాలెంట్ ముందు తాను ఒత్తిడికి లోనయ్యానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Kavitha : భవిష్యత్‌లో సీఎం అవుతా..బీఆర్ఎస్ నాదే.. కొత్త పార్టీ పెట్టను : ఎమ్మెల్సీ కవిత
ప్రస్తుతం నాగ చైతన్య కెరీర్ పరంగా మంచి జోష్‌లో ఉన్నాడు. తండేల్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన, త్వరలో 25వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహించే అవకాశం ఉండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘మజిలీ’లో చైతూ-సమంత జంటగా నటించగా, తాజా ప్రాజెక్ట్‌లో రియల్ లైఫ్ పార్ట్‌నర్ శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటించబోతున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే చైతూ కెరీర్‌లో మరో సరికొత్త మలుపు అని చెప్పొచ్చు.