Kalki 2898 AD : నాగ్ అశ్విన్ నిజంగా ఆలోచించే అన్నాడా..? నాలుగు గ్రహాలకు, కల్కి రిలీజ్‌కి లింక్..!
అప్పుడెప్పుడో నాగ్ అశ్విన్ సరదాగా అన్న మాటలు ఇప్పుడు నిజం అవుతుంది. నాలుగు గ్రహాలకు, కల్కి రిలీజ్‌కి లింక్ ఏంటి..?
- By News Desk Published Date - 12:37 PM, Sun - 2 June 24

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ అవ్వడంతో రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్ గా ఈ మూవీని ఈ నెల 27న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ లో ఒక విశేషం ఉంది.
అదేంటంటే, గతంలో ఒక ఈవెంట్ లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ నాగ్ అశ్విన్ ని ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. “కల్కి రిలీజ్ అవ్వాలంటే నాలుగు గ్రహాలు ఒకే లైన్ లోకి రావాలి. ఒక గ్రహణం జరగాలి” అంటూ కామెంట్స్ చేసారు. అయితే ఆ సమయంలో నాగ్ అశ్విన్ ఈ కామెంట్స్ సరదాగా చేసారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు రిలీజ్ సమయంలో జరుగుతున్న సంఘటన చూసి.. నాగ్ అశ్విన్ ఆ వ్యాఖ్యలను ఆలోచించే అన్నారా..? అనే సందేహం కలుగుతుంది.
నాగ్ అశ్విన్ అన్నట్లే.. కల్కి రిలీజ్ కి ముందు కొన్ని గ్రహాలు ఒకే లైన్ లోకి రాబోతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. రేపు (జూన్ 3) అరుదైన ఖగోళ సంఘటన జరగబోతుంది. మెర్క్యురీ, మార్స్, బృహస్పతి, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్.. ఇలా ఆరు గ్రహాలు ఒకే లైన్ లోకి రాబోతున్నాయట. దీనిని ‘గ్రహాల కవాతు’గా పిలుస్తారట. ఈ ఖగోళ సంఘటన జరిగిన తరువాతే.. జూన్ 27న కల్కి రిలీజ్ కాబోతుంది. దీంతో అప్పుడెప్పుడో నాగ్ అశ్విన్ సరదాగా అన్న మాటలు ఇప్పుడు నిజం అవుతుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని నమోదు చేస్తుందో చూడాలి.
Serious ganey ayyayi ga @nagashwin7#Kalki2898 month 🔥 https://t.co/6A56apULzs pic.twitter.com/ber9ADhjJw
— Incognito Telugu (@IncognitoTelugu) June 2, 2024