Nabha Natesh : యాక్సిడెంట్.. రెండు సర్జరీలు.. హీరోయిన్ నభా నటేష్ ఎంత కష్టపడిందో..
నభా నటేష్ తన యాక్సిడెంట్ తర్వాత లైఫ్ గురించి మాట్లాడింది.
- By News Desk Published Date - 04:29 PM, Sun - 7 July 24

Nabha Natesh : ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయింది హీరోయిన్ నభా నటేష్. తెలుగులో పలు సినిమాలతో, సోషల్ మీడియాలో ఫొటోలతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. త్వరలో డార్లింగ్ అనే సినిమాతో రాబోతుంది. తాజాగా నేడు డార్లింగ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నభా నటేష్ తన యాక్సిడెంట్ తర్వాత లైఫ్ గురించి మాట్లాడింది.
2022 లో నభా నటేష్ కి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆపరేషన్ కూడా అయి కోలుకొని కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చింది. యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు డార్లింగ్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
డార్లింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నభా నటేష్ మాట్లాడుతూ.. నా కెరీర్ పీక్ లో వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల ఒక సర్జరీ జరిగింది. ఆ యాక్సిడెంట్ తర్వాత నేను ఒక రకమైన మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాను. ఆపరేషన్ అయిన పదిరోజులకు ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో మళ్ళీ హెల్త్ కి ఎఫెక్ట్ అయింది. దీంతో ఇంకో సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆరోగ్యం ముఖ్యం అని ఆరు నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకున్నాను. ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఫిట్ అయ్యాను. ఫిజికల్ గా, మెంటల్ గా మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాకే మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను అని తెలిపింది. దీంతో పాపం నభా నటేష్ ఎంతగా కష్టపడిందో అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Raj Tharun : రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. నేను, రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాం.. కానీ..