Rajinikanth : సూపర్ స్టార్ తో మైత్రి మూవీ మేకర్స్ ..?
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఓ చిత్రం చేయాలన్న ఆలోచనతో మైత్రీ మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది
- Author : Sudheer
Date : 18-05-2025 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
పాన్ ఇండియా బ్యానర్‌గా సత్తా చాటుతున్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యానర్ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇప్పుడు దేశంలోని అగ్రతర సినీ నటులతో సినిమాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth )తో ఓ చిత్రం చేయాలన్న ఆలోచనతో మైత్రీ మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్‌తో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.
Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం
ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిగా యంగ్ టాలెంట్ వివేక్ ఆత్రేయ (Vivek Atreya) పేరు వినిపిస్తోంది. మెంటల్ మదిలో, బ్రోచేవారేవరు, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన వివేక్ ఆత్రేయకి, ఇటీవల కమర్షియల్ విజయం కూడా లభించింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌కి ఈ కథ నచ్చితే, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ దశలో ఉన్నా, మైత్రీ – రజనీకాంత్ కాంబినేషన్ దాదాపుగా ఫిక్సయినట్టే తెలుస్తోంది. దర్శకుడిగా వివేక్ ఆత్రేయకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అవసరమైతే మరొక దర్శకుడిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. రజనీకాంత్ కూడా మైత్రీతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి స్థాయిలో క్లారిటీ రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో చెబుతున్నారు. మైత్రీ – రజనీ కలయికపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు మొదలవుతున్నాయి.