Mutamestri : ‘ముఠా మేస్త్రి’కి 32 ఏళ్లు
Mutamestri : ఈ సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 32 ఏళ్లు. ఈ చిత్రంలో చిరంజీవి , మీనా , రోజా , శరత్ సక్సేనా ముఖ్య పాత్రలు పోషించగా, రాజ్-కోటి సంగీతం సమకూర్చారు
- By Sudheer Published Date - 10:09 AM, Fri - 17 January 25

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కోదండరామిరెడ్డి (Chiranjeevi – Kodanda Ramreddy) కలయిక అంటే అప్పట్లో బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యేవారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బద్దలు కొట్టేవి. చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో 23చిత్రాలు వచ్చాయి. ముందుగా వీరి కలయిలో వచ్చిన తొలి చిత్రం ‘న్యాయం కావాలి’. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 22 సినిమాలు రాగా..వాటిలో ముఠా మేస్త్రి (Mutamestri ) మూవీ ట్రెండ్ సెట్ చేసింది.
IMD Issued Alert: ఈ 8 రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు!
ఈ సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 32 ఏళ్లు. ఈ చిత్రంలో చిరంజీవి , మీనా , రోజా , శరత్ సక్సేనా ముఖ్య పాత్రలు పోషించగా, రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. 1993 జనవరి 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది . చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం గెలుచుకున్నారు. దీనిని తమిళంలో మంభూమిగు మేస్త్రీ పేరుతో డబ్ చేసి విడుదల చేసి అక్కడ కూడా సక్సెస్ సాధించింది. ఈ మూవీ లో బోస్ పాత్రలో చిరంజీవి నటన మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మార్కెట్ లో ముఠా మేస్త్రి నుండి రాజకీయ నేతగా , మంత్రిగా తన పాత్రలో ఒదిగిన తీరు మాటల్లో చెప్పలేం. ఇప్పటికి ఈ సినిమా బుల్లితెర పై సందడి చేస్తుంటుంది. అలాగే ఈ మూవీ లో పాటలు సైతం ఓ ఊపు ఊపేసాయి. ఇప్పటికి వినిపిస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప మూవీ విడుదలై నేటి 32 ఏళ్లు అవుతుండడం విశేషం.
32 years completed for Blockbuster “ Muta Mestri “
Festival tarwatha release ayyi Collections Tsunami create chesina Mass Bomma 💥
Boss @KChiruTweets Marana mass 🔥#32yearsforMutamestri pic.twitter.com/pvI2UMQhUI
— chiranjeevi tharvathe yevarayina (@Deepu0124) January 16, 2025