Mrunal Thakur: హైదరాబాద్ లో సొంతింటిని కొనుగోలు చేసిన ‘సీతారామం’ బ్యూటీ!
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కూడా సీతారామం సక్సెస్ తో ఆర్థిక వ్యవహరాలను చక్కబెట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.
- By Balu J Published Date - 01:43 PM, Sat - 18 March 23

‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం’ అంటే ఇదేనేమో.. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కూడా సీతారామం సక్సెస్ తో ఆర్థిక వ్యవహరాలను చక్కబెట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. సీతారామం విజయంతో మృణాల్ ఠాకూర్ సౌత్ ఇండస్ట్రీ లో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ హైదరాబాద్ లో సొంతింటిని కొనుగోలు చేసింది. భారీ, విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని కోట్లు కూడా ఖర్చు చేసిందట. అయితే దీన్ని బట్టి చూస్తే మృణాల్ ఠాకూర్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు, తమిళ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది
సీతారామం తర్వాత మృణాల్ తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సెల్ఫీ’ అనే సినిమాతో పలకరించింది. ఈ సినిమా మలయాళీ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్న కలెక్షన్స్ మాత్రం రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఏదో ఒక సినిమా ఒప్పుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈమధ్య తెలుగులో తన రెండోవ చిత్రాన్ని Nani30 గా ప్రకటించింది ఈ హీరోయిన్.
సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయిపోయింది. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. తెలుగులోనే కాదు సీతారామం చిత్రంతో సౌత్ లోని ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ పేరు మారు మ్రోగిపోయింది. ఇక ఈ సినిమాలో సీతగా ప్రేక్షకులను మెప్పించిన మృణాల్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేయడానికీ రెడీ అవుతోంది.
Also Read: Ram Charan Reaction: ఆస్కార్ స్టేజీపై డాన్స్ చేయడానికి నేను సిద్ధమే.. కానీ!

Related News

Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. మసీద్, దర్గాలకు క్లాత్ చుట్టేసి?
భారతదేశం లోని హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. శ్రీరామనవమి రోజున