Mowgli First Day Collection : రోషన్ కనకాల ‘మోగ్లీ’ ఫస్ట్ డే కలెక్షన్స్
Mowgli First Day Collection : తొలి రోజు కలెక్షన్లపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ మూవీ ఓపెనింగ్ డేన వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ షోలతో కలిపి రూ. 1.22 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. వీకెండ్ కావడంతో
- Author : Sudheer
Date : 14-12-2025 - 5:22 IST
Published By : Hashtagu Telugu Desk
యాంకర్ సుమ కుమారుడు, యువ హీరో రోషన్ కనకాల, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘మోగ్లీ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు కలెక్షన్లపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ మూవీ ఓపెనింగ్ డేన వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ షోలతో కలిపి రూ. 1.22 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించింది.
Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!
‘మోగ్లీ’ చిత్ర కథ విషయానికి వస్తే… చిన్ననాటే తల్లిదండ్రులను కోల్పోయిన మురళీ కృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) అడవిని తన అమ్మగా భావించి అక్కడే పెరుగుతాడు. సినిమా షూటింగ్‌లకు సహాయం చేస్తూ జీవనం సాగించే మోగ్లీకి ఎస్సై కావాలనేది కల. ఈ క్రమంలోనే ఓ షూటింగ్ కోసం వచ్చిన డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె మూగ-చెవిటి అని తెలిసినా ప్రేమించడం విశేషం. అయితే, ఊరికి వచ్చిన కొత్త ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) కన్ను జాస్మిన్‌పై పడటంతో కథ మలుపు తిరుగుతుంది.
ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ ఎలాగైనా జాస్మిన్‌ను సొంతం చేసుకోవాలని, మోగ్లీ-జాస్మిన్‌ల ప్రేమను విడదీయాలని ప్రయత్నిస్తాడు. మోగ్లీపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడతాడు. దీంతో మోగ్లీ.. జాస్మిన్‌ను తీసుకుని అడవిలోకి వెళ్లిపోతాడు. క్రిస్టోఫర్ నుంచి జాస్మిన్‌ను మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? అతని ఎస్సై కల నెరవేరిందా? వారి ప్రేమ గెలిచిందా? అన్నది మిగిలిన కథాంశం. విలన్‌గా బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, ప్రేమ, పోరాటం, కలల సాధన నేపథ్యంలో ఆసక్తికరంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది.