HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mouni Roy In Vishwambhara

Vishwambhara : చిరంజీవి కోసం రంగంలోకి దిగిన హాట్ బ్యూటీ

Vishwambhara : ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం హాట్ బ్యూటీ, బాలీవుడ్ నటిని మౌని రాయ్(Mouni Roy) రంగంలోకి దిగారు

  • Author : Sudheer Date : 25-07-2025 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mouni Roy
Mouni Roy

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం హాట్ బ్యూటీ, బాలీవుడ్ నటిని మౌని రాయ్(Mouni Roy) రంగంలోకి దిగారు. ఇది ఆమె తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇప్పటివరకు హిందీ సినిమాలు తెలుగులో డబ్బింగ్ రూపంలో వచ్చినప్పటికీ, నేరుగా తెలుగులో నటించడం ఇదే మొదటిసారి. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మౌనికి ఎంతో గర్వకారణంగా మారింది.

తాజాగా చిరంజీవి కేరళ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు చేరగా, రెండు రోజుల విశ్రాంతి తర్వాత ‘విశ్వంభర’లో మౌని రాయ్‌తో కూడిన స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ పాటను మూడు-నాలుగు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. మౌని రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌లోని లొకేషన్ ఫోటోలు, టీంతో దిగిన సెల్ఫీలు షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

Non-veg Food: శ్రావ‌ణ మాసంలో నాన్ వెజ్ తిన‌కూడ‌దా? కార‌ణాలీవే?!

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, స్పెషల్ సాంగ్‌కు యువ సంగీత దర్శకుడు భీమ్స్ స్వరాలు అందిస్తున్నారు. చిరు సాంగ్స్‌కి ప్రత్యేక క్రేజ్ ఉండగా, ‘అన్నయ్య’లో ‘ఆట కావాలా పాట కావాలా’ తరహాలోనే ఈ పాటను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజిషన్ చేస్తున్నారు. మౌని – చిరు కాంబినేషన్‌ను తెరపై చూడాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష మరియు ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించనుండగా, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bheems music
  • chiranjeevi
  • Mouni Roy
  • Vishwambhara
  • Vishwambhara item song
  • Vishwambhara Latest Update

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd