Mohanlal wins Dadasaheb Phalke Award 2025 : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్‌లాల్
Mohanlal wins Dadasaheb Phalke Award 2025 : 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మలయాళ సినీ ప్రముఖుడు మోహన్‌లాల్(Mohanlal)కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Mohanlal wins Dadasaheb Phalke Award 2025) ప్రదానం చేశారు
- By Sudheer Published Date - 07:29 PM, Tue - 23 September 25

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మలయాళ సినీ ప్రముఖుడు మోహన్‌లాల్(Mohanlal)కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Mohanlal wins Dadasaheb Phalke Award 2025) ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఈ అవార్డును అందజేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో, అనేక తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్‌లాల్‌కు సభలో నిలబడి అభినందనలు తెలిపారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అందుకున్న ఆయన, ఈ అవార్డుతో మరోసారి భారతీయ సినీ రంగ చరిత్రలో తన స్థానాన్ని బలపరచుకున్నారు.
Maruti: మారుతి సుజుకి 35 ఏళ్ల రికార్డు బ్రేక్.. భారీగా అమ్మకాలు!
సైనికుడిగా, కవి, రాజు, సాధారణ మనిషి లాంటి విభిన్నమైన పాత్రలను సహజంగా పోషించి మోహన్‌లాల్ మిలియన్లాది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ప్రస్థానం కేవలం మలయాళ సినీ పరిశ్రమకు మాత్రమే కాకుండా, భారతీయ సినిమాకే ఒక విశేష గర్వకారణం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. మోహన్‌లాల్ అనేక రకాల పాత్రల్లో నటించినప్పటికీ, ఆయన ప్రభావం ఎప్పటికీ తగ్గలేదని, ఈ స్థిరమైన క్రేజ్ ఆయన ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అదే వేదికపై ‘ఉల్లోజుక్కు’ చిత్రంలో సహాయ పాత్ర పోషించిన ఉర్వశి, ‘పూక్కలం’ సినిమాలో నటించిన విజయరాఘవన్‌లకు కూడా అవార్డులు లభించడం మలయాళ సినీ రంగానికి గౌరవాన్ని తెచ్చింది.
మోహన్‌లాల్ తన ప్రసంగంలో ఈ అవార్డు కేవలం తనకే కాకుండా మొత్తం మలయాళ సినీ రంగానికే చెందిందని భావోద్వేగంగా తెలిపారు. సినిమా తన ఆత్మధడక అని పేర్కొంటూ, సహచర కళాకారులు, దర్శకులు, ప్రేక్షకుల సహకారంతోనే ఈ గౌరవానికి తాను అర్హుడయ్యానని అన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఈ వార్త విన్నప్పుడు తనకు మొదట నమ్మలేకపోయిన అనుభూతిని గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను కలిగించిందని, ఇది మలయాళ సినీ వారసత్వం, ప్రతిభ, కృషికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఆయన ఈ గౌరవాన్ని గత మాస్టర్లకు, ప్రస్తుత సహచరులకు, అలాగే కేరళ సినీ ప్రేక్షకులందరికీ అంకితం చేశారు.