Mogali Rekulu Fame Pavithra Nath : మొగలిరేకులు ఫేమ్ పవిత్రనాథ్ మృతి
- Author : Sudheer
Date : 02-03-2024 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
మొగలిరేకులు ఫేమ్ (Mogali Rekulu Fame) పవిత్రనాథ్ (Pavithra Nath) కన్నుమూయడం తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ .. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పవిత్రనాథ్ చిన్న వయసులోనే మరణించడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
“పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైనవాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధం అయితే బాగుండని ఆశపడ్డాను.. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణయించుకులేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దయ చనిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో పవిత్రనాథ్ పై అతని భార్య సంచలన ఆరోపణలు చేసింది. తనని బాగా టార్చర్ చేసాడని, నా ముందే వేరే అమ్మాయిలతో తిరిగేవాడని, నన్ను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేయగా అప్పుడు పవిత్రనాథ్ వైరల్ అయ్యాడు.
Read Also : Central Bank of India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 వేల ఉద్యోగాలు..!