Hari Hara Veeramallu: వీరమల్లు చిత్రంపై కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుకుంటున్న హరి హర వీరమల్లు చిత్రం అగ్గిపోయిందని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రం ఆగిపోయినట్లు అనుకున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ పైనే ఉన్నట్లు తెలుస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 09-01-2024 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుకుంటున్న హరి హర వీరమల్లు చిత్రం అగ్గిపోయిందని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రం ఆగిపోయినట్లు అనుకున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ పైనే ఉన్నట్లు తెలుస్తుంది.
వీరమల్లు చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. భారీ పీరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ స్టేజ్ లోనే ఉంది కానీ.. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు. ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. వీరమల్లు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఈ సినిమా గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మేకర్స్ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
అయితే.. స్వరవాణి కీరవాణి మాత్రం వీరమల్లు గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. ఇప్పటి వరకు వీరమల్లు కోసం మూడు పాటలు రికార్డ్ అయ్యాయని చెప్పారు. డైరెక్టర్ క్రిష్ అందుబాటులోకి వస్తే మిగతా పాటలు రికార్డ్ చేస్తామని చెప్పారు. అసలు ఎన్ని పాటలు ఉన్నాయో సంగీత దర్శకుడుకు కూడా తెలియదు. పాటలే పెండింగ్ లో ఉంటే.. అసలు షూటింగ్ ఎంత వరకు అయ్యింది..? టాకీ పార్ట్ ఎంత అయ్యుంటుంది..? అసలు ఎప్పుడు ఈ సినిమాను తిరిగి ప్రారంభిస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బాగా బిజీ అయ్యారు. ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ స్టార్ట్ చేస్తారు. అయితే.. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేయాలి. ఆతర్వాత వీరమల్లుకు డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకనే అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఇష్టం లేక క్రిష్ ఈలోపు వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. వీరమల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో..? క్లారిటీ రావాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.
Also Read: Guntur Kaaram Pre Release : ఇక మీరే నా అమ్మ..నాన్న – మహేష్ బాబు