Mirai Movie Records : 150 కోట్లకు చేరువలో మిరాయ్
Mirai Movie Records : 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.134.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మేకర్స్ ఈ విజయాన్ని పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ, "సూపర్ యోధ డామినేషన్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది
- By Sudheer Published Date - 08:30 AM, Tue - 23 September 25

యంగ్ హీరో తేజా సజ్జా నటించిన సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘మిరాయ్’ (Mirai ) బాక్సాఫీస్ వద్ద దూకుడు కనపరుస్తుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలై మొదటి ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. తాజాగా 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.134.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మేకర్స్ ఈ విజయాన్ని పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ, “సూపర్ యోధ డామినేషన్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది” అనే సందేశాన్ని ఇచ్చారు. ఇలాగే కలెక్షన్ల జోరు కనపరిస్తే త్వరలోనే రూ.150 కోట్ల మార్క్ దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Made in India Products : మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే కొనాలి – CBN
తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక VFX వర్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ‘మిరాయ్’ బృందం విజయం సాధించింది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫిదా అయ్యేలా చేసిన అంశం సూపర్ యోధ ‘వేద’గా తేజా సజ్జా నటన. ముఖ్యంగా ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లు, భావోద్వేగ సన్నివేశాల్లో చూపించిన ఎనర్జీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అలాగే, మంచు మనోజ్ ‘మహావీర్ లామా’గా విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. వేద-లామా మధ్య జరిగిన యాక్షన్ ఎపిసోడ్లు కొత్త స్థాయిలో తెరకెక్కి సినిమాకు మైలు రాయిగా నిలిచాయి.
ఈ సినిమాలో తేజా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్‌తో పాటు శ్రియా, జగపతిబాబు, జయరామ్, గెటప్ శ్రీను, వెంకటేష్ మహా, కిషోర్ తిరుమల వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, ప్రొడక్షన్ విలువల్లోనూ ఎలాంటి తగ్గింపులు లేకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది. దీని ఫలితంగా సినిమా విజువల్స్, గ్రాఫిక్స్ స్థాయిలో హాలీవుడ్ రేంజ్‌లో కనిపించాయి.