Mirai First Review: ‘మిరాయ్’ ఫస్ట్ రివ్యూ
Mirai First Review: ఇది తెలుగు సినిమా అనిపించదని, హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం, సెకండాఫ్‌లోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు
- By Sudheer Published Date - 02:09 PM, Sun - 24 August 25

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మిరాయ్ (Mirai ) సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ నెలాఖరులో ‘ఓజీ’, ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమాలు ఉన్నందున, మిరాయ్ నిర్ణీత తేదీకే వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చేవరకు దీనిపై స్పష్టత రాదు.
Minister Narayana : చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ
ఇప్పటికే ఈ సినిమా రషెస్‌ను చూసిన కొంతమంది మీడియా వర్గాలు, ఇది తెలుగు సినిమా అనిపించదని, హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం, సెకండాఫ్‌లోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. ‘హనుమాన్’ సినిమా క్లైమాక్స్ లో ఆంజనేయుడి ఎంట్రీ ప్రేక్షకులను ఎలా థ్రిల్ చేసిందో, మిరాయ్ లో శ్రీ కృష్ణుడు పాత్ర ప్రవేశం కూడా అదే స్థాయిలో ఉంటుందని సమాచారం. ఈ పాత్రలో ఓ స్టార్ హీరో నటించారని, అది ప్రేక్షకులకు పెద్ద సర్ ప్రైజ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం మంచు మనోజ్ పాత్ర. కొంతకాలం గ్యాప్ తీసుకున్న మనోజ్, ఇందులో నెగెటివ్ రోల్ లో నటించారు. ఈ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలవడమే కాకుండా, మనోజ్ కెరీర్‌లో ఒక మంచి మలుపు అవుతుందని టాక్. మొత్తానికి, ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన తేజ సజ్జకు మిరాయ్ మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.