HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mind Blowing Crime Thriller Isakapatnam Has Arrived On Ott

Isakapatnam: ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’

  • Author : Vamsi Chowdary Korata Date : 04-07-2026 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mind-blowing crime thriller 'Isakapatnam' has arrived on OTT.
Mind-blowing crime thriller 'Isakapatnam' has arrived on OTT.

ప్రైమ్ వీడియోలో #3వ స్థానంలో ట్రెండ్ అవుతూ, ఈ సిరీస్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రజాదరణను పొందుతోంది.

సముద్రఖని – ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించిన తెలుగు సిరీస్ ‘ఇసకపట్నం’. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్ల కథతో రూపొందింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చిన ఈ సిరీస్, ఈ రోజు (జులై 2) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సునీల్, నరేశ్ అగస్త్య, రాజీవ్ కనకాల, బెనర్జీ కీలక పాత్రలను పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ విశేషాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

నాయుడు (సముద్రఖని) తన భార్యాబిడ్డలతో కలిసి, ఒక సాధారణ వ్యక్తిలా ‘ఇసకపట్నం’లో అడుగుపెడతాడు. సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు జీవించే ప్రాంతం అది. అక్కడి మత్స్యకారులంతా చిన్నారావు (రాజీవ్ కనకాల) చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటారు. అది ‘పోతన’ (జ్వాలా కోటి)కి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అది గ్రహించిన నాయుడు, అతని సపోర్టుతో చిన్నారావును హత్య చేసి తాను నాయకుడు అవుతాడు.

నాయుడు ఆ పోర్టు ఏరియాలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు. అతని కూతురు భారతి (ఐశ్వర్య రాజేశ్) వయసుకి వస్తుంది. తండ్రి దుర్మార్గాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఆమె, సమాజానికి మేలు చేసే పనులను చేస్తూ వెళుతుంటుంది. తమ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సూరి (సుధాకర్ కోమకుల)తో ప్రేమలో ఉంటుంది. నాయుడు ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతూ వెళ్లడాన్ని పోతన తట్టుకోలేకపోతాడు. నాయుడికి శత్రువైన జమిందార్ ప్రతాప్ వర్మ (రవి వర్మ) సపోర్టు తీసుకుంటాడు.

అదే ఊళ్లో ఆటో నడుపుకుని జీవిస్తున్న పెద్దన్న (నరేశ్ అగస్త్య)కి కార్పొరేటర్ కావాలని ఉంటుంది. రాజకీయాలకు, ముఠా తగాదాలకు దూరంగా అతను తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇక నాయుడు కూడానే ఉండే శేఖరం (రాజా) అతని కుర్చీలో కూర్చునే అవకాశం కోసం వేచి చూస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే పోతన – ప్రతాప్ వర్మ చేతులు కలిపినట్టుగా నాయుడు తెలుసుకుంటాడు. ప్రతాప్ వర్మకు ఉన్న ఆర్థికబలం గురించి తెలిసిన నాయుడు, అతనికి తన కూతురు భారతిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.

అప్పుడు భారతి ఎలా స్పందిస్తుంది? ఆమె ప్రేమకథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? ప్రతాప్ వర్మను తనవైపుకు తిప్పుకోవడానికి నాయుడు వేసిన ప్లాన్ ఫలిస్తుందా? అతని వారసుడిగా పెత్తనం చెలాయించాలని ఆశపడుతున్న శేఖరం పరిస్థితి ఏమిటి? పోతనకి దక్కే ఫలితం ఎలాంటిది? పెద్దన్న కార్పొరేటర్ అవుతాడా? చివరికి గెలుపెవరిది? అనేది మిగతా కథ.

కుటుంబం పట్ల ప్రేమ, ఇతరుల పట్ల జాలి, సమాజం పట్ల బాధ్యత లేని వారు ఎంతకైనా తెగిస్తారు. డబ్బు, అధికారం గురించి మాత్రమే ఆలోచించే అలాంటి వారిలో రాక్షసత్వం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక మనిషిలాంటి మృగం చుట్టూ తిరిగే కథ ఇది. అతని ప్రయాణం, ఆ దారిలో అతనికి సహకరించే పాత్రలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. తన ముఠా రాజకీయాల కోసం కూతురు జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనుకాడని ఒక కఠినాత్ముడి కథ ఇది.

ఈ సిరీస్‌ను చూస్తున్నప్పుడు మనకి అర్థమయ్యేది ఏమిటంటే, ఇది ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య జరిగే పోరాటం అనిపిస్తుంది. అందువల్ల సముద్రఖనితో సమానమైన పవర్‌తో ఐశ్వర్య రాజేశ్ పాత్ర ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు, కానీ అలా జరగలేదు. ఐశ్వర్య రాజేశ్ పాత్రను గాడిలో పెట్టడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఈ లోగా ఆమెపై ఆవిష్కరించిన సన్నివేశాలలోనూ అంతగా దమ్ము కనిపించదు.

ఫస్ట్ ఎపిసోడ్‌లోనే చాలా కథ చెప్పారు. అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఆ స్థాయి స్పీడ్‌లో మిగతా ఎపిసోడ్లు పరిగెత్తలేకపోయాయి. కథ ఒక దశకి చేరుకున్న తరువాత అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. పెద్దగా ట్విస్టులు లేకపోవడం, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రేకెత్తించకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. చూస్తున్నంత సేపు బాగానే అనిపిస్తుంది, కానీ ఎక్కడా కొత్త మలుపు అనేది మాత్రం కనిపించదు.

కథా పరంగా చూసుకుంటే ముఖ్యమైన పాత్రలు చాలా కనిపిస్తాయి. కానీ ఆ పాత్రలకు తగిన పవర్‌ను జోడించలేకపోయారు. ఆయా పాత్రల మధ్య ఎత్తుపల్లాలను ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయారు. చుట్టూ ఎన్ని పాత్రలు ఉన్నప్పటికీ సముద్రఖని పాత్ర మాత్రమే హైలైట్ అవుతూ ఉంటుంది, ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆయన స్థాయికి తగిన పాత్రలు చుట్టూ లేకపోవడం వల్ల, ఆడియన్స్‌లో ఎలాంటి ఆసక్తి కలగకుండా పోతుంది.

నరేశ్ అగస్త్య పాత్రను కూడా చాలా వరకు వదిలేశారు. అప్పుడప్పుడు మాత్రమే కనిపించే ఆ పాత్ర కనెక్ట్ కాలేకపోయింది. ఇక చాలా తెలివైనది, ధైర్యవంతురాలైన భారతి, తన పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పకుండా మనలను అయోమయంలో పడేస్తుంది. ఆమె ఉద్దేశం ఏమిటనేది చెప్పే విషయంలో కూడా క్లారిటీ లోపించిందేమో అనే భావన కలుగుతుంది.

నిర్మాణ పరమైన నాణ్యత విషయంలో ఎక్కడా వంక పెట్టవలసిన పనిలేదు. ఒక సినిమాను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. పాత్రలు, ఆ పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక కరెక్టుగా ఉంది. వంశీ పచ్చిపులుసు ఫొటోగ్రఫీ, ప్రవీణ్ లక్కరాజు సంగీతం బాగున్నాయి. బలమైన కథను రాసుకున్నారు, సన్నివేశాలను అంతే బలంగా ఆవిష్కరించారు. అయితే ఆయా పాత్రలను డిజైన్ చేసిన తీరులోనే కొంత లోపం కనిపిస్తూ ఉంటుంది. సముద్రఖని నటనను ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది.

అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, తేజ సజ్జ, నాగ చైతన్య, వి.వి. వినాయక్, హరీష్ శంకర్, సుధీర్ బాబు మరియు అనేకమంది ప్రముఖులతో సహా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల నుండి ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంది.
అద్భుతమైన నిర్మాణ విలువలు, సినిమాటిక్ విజువల్స్ మరియు అత్యున్నత స్థాయి చిత్రీకరణకు ఈ సిరీస్ విస్తృత ప్రశంసలు పొందింది.

Cast: Aishwarya Rajesh, Samuthirakani, Sunil, Naresh Agastya, Merin Philip, Sudhakar Komakula, Rajeev Kanakala, Mime Gopi, Banerjee, Jwala Koti, Ravi Varma, Raja Chembolu and others
Director : Garry BH
Music : Praveen Lakkaraju
Cinematography : Vamsi Patchipulusu
Producers : Rahul Tamada & Saideep Reddy Borra
Banner : Tamada Media Productions


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aishwarya Rajesh
  • Amazon Prime Video
  • Isakapatnam
  • Rajeev Kanakala
  • Samuthirakani
  • sandeep reddy
  • sunil

Related News

    Latest News

    • Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

    • TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

    • కార్మిక శాఖ పేరులో మార్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై ‘శక్తి’ శాఖగా

    • Isakapatnam: ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’

    • vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd