Megha Shukla Photo Shoot : అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా..?
Megha Shukla Photo Shoot : తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని మేఘా శుక్లా బాలీవుడ్‌లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె
- By Sudheer Published Date - 08:12 PM, Tue - 15 July 25

ఈ రోజుల్లో సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఓ శక్తివంతమైన సాధనంగా మారింది. తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, అభిమానులతో నేరుగా మమేకం కావడానికి ఈ వేదికను చాలా మంది తారలు వినియోగిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మరింత గ్లామర్ దిశగా దూసుకెళ్తూ తమ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నారు. తాజాగా బాలీవుడ్ మోడల్, నటి మేఘా శుక్లా (Megha Shukla ) అలాంటి ఫోటో షూట్ తో వార్తల్లో నిలిచింది.
IndiGo : ‘మాన్‌సూన్ సేల్’ను ప్రకటించింన ఇండిగో..రూ.1,499 ధరకే విమాన ప్రయాణం
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని మేఘా శుక్లా బాలీవుడ్‌లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, అనంతరం “కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ” వంటి సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మేఘా సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉంటూ తన లైఫ్‌స్టైల్, ఫొటోషూట్లను రెగ్యులర్‌గా షేర్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని బోల్డ్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె విభిన్నమైన, ఆసక్తికరమైన దుస్తుల్లో తన అందాలను బయటపెట్టింది. కొన్ని ఫొటోలలో తన ప్రైవేట్ పార్ట్స్‌ను స్పష్టంగా చూపిస్తూ యూత్‌ను ఆకర్షించడానికి ప్రయత్నించింది.
మేఘా (Megha Shukla ) చేసిన ఈ హై గ్లామర్ ఫొటోషూట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఆమె అందానికి ఫిదా అవుతూ పొగడ్తలు కురిపిస్తుంటే, మరికొందరు అవకాశాల కోసం ఇలా దిగజారాల్సిన అవసరముందా అంటూ విమర్శిస్తున్నారు. “ఇంత అందమైన ఫొటోషూట్ చేసినా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు, ఇది ఇండస్ట్రీలోని వాస్తవ స్థితి” అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే సోషల్ మీడియా ద్వారా తాను మరింత గుర్తింపు పొందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తోందని అనుకోవచ్చు. ఏది ఏమైనా, మేఘా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.