Ram Charan : మెగా కజిన్స్ కోసం చరణ్.. రామ్‌చరణ్‌ని కజిన్స్ అంతా ఏమని పిలుస్తారో తెలుసా..?
మెగా కాంపౌండ్ ఇప్పటి జనరేషన్ లో చాలా మంది ఉన్నారు. ఈ మెగా కజిన్స్ అంతా రామ్ చరణ్ ని ఏమని పిలుస్తారో తెలుసా..?
- Author : News Desk
Date : 24-06-2023 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) చిరంజీవి(Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఇదే మెగా ఇమేజ్ తో చరణ్ కి ముందు వెనుక ఇండస్ట్రీకి చాలా మంది వారసులు వచ్చారు. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఆడియన్స్ ముందుకు వచ్చే వారికంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు.
నాగబాబు(Nagababu) ఒక ఇంటర్వ్యూలో ఫ్యామిలీలో రామ్ చరణ్ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాడని, కుటుంబంలోని కజిన్స్ లో ఏ ఇబ్బంది వచ్చినా చరణ్ పెద్దరికం తీసుకోని దానిని సెటిల్ చేస్తాడని తెలిపాడు. తాజాగా ఇదే విషయాన్ని మెగా డాటర్ నిహారిక కూడా తెలియజేసింది. రామ్ చరణ్ కి కూతురు పుట్టిన విషయం తెలిసిందే.
ఆ పాప గురించి నిహారిక(Niharika) మాట్లాడుతూ.. మా కజిన్స్ లో ఏ ప్రాబ్లెమ్ వచ్చినా చరణ్ అన్నే చూసుకుంటాడు. ప్రతి ఒకర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే మేమంతా చరణ్ అన్నని ‘బాపూజీ’ అని పిలుస్తాం అని చెప్పింది. అలాంటి చరణ్ సంరక్షణలో ఆ పాప ఎలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, ఉపాసన ఒక స్ఫూర్తిని ఇచ్చే మహిళ అని, ఆమెను చూస్తూ ఆ పాప గొప్పగా ఎదుగుతుందని, ఉన్నత స్థాయికి వెళ్తుందని తెలిపింది. చిరంజీవి సిస్టర్, సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ.. మా ఫ్యామిలీలోని ఇప్పటి జనరేషన్ వాళ్ళని చరణ్ బాబే ఒక కంట కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటాడు అని తెలిపారు.
Also Read : Nikhil Siddhartha : నాకు కొంతమంది డ్రగ్స్ ఆఫర్ చేశారు.. అవి తీసుకొని ఉంటే.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..