HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi God Father Sets Second Innings

Megastar Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ – మరో మెగా ఇన్నింగ్స్ కి నాంది!

Megastar Chiranjeevi: నాలుగు దశాబ్దాలు దాటిన చిరంజీవి సినిమా ప్రయాణంలో తనలోని సంపూర్ణ నటుడు తెర మీద ఆవిష్కృతమైన సినిమాలేవీ వాణిజ్యపరంగా అనుకున్న ఫలితాలు సాధించలేదు.

  • Author : Balu J Date : 11-10-2022 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
God Father
God Father

Megastar Chiranjeevi: నాలుగు దశాబ్దాలు దాటిన చిరంజీవి సినిమా ప్రయాణంలో తనలోని సంపూర్ణ నటుడు తెర మీద ఆవిష్కృతమైన సినిమాలేవీ వాణిజ్యపరంగా అనుకున్న ఫలితాలు సాధించలేదు. ఆ కారణంగా తనతో సినిమాలు చేసే నిర్మాతల్ని, తన సినిమాలపై జరిగే వ్యాపారాన్ని, తన నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు దూరంగా ఉంటూ చిరంజీవి సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది, నిజానికి సినిమా ప్రేక్షకుల్లో నెలకో కొత్త తరం వస్తోంది. భాషతో నిమిత్తం లేకుండా ప్రపంచ దేశాల్లో విడుదలయ్యే ఏ సినిమానైనా సరే మన ఇళ్ళల్లో కూర్చుని ఓటీటీ ద్వారా చూడగలిగే సౌలభ్యమూ ప్రేక్షకులకు కలిగింది. కోవిడ్ కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బ తిన్న వాటిలో సినిమా థియేటర్ రంగం ఒకటి.

సమాజంలో వేగంగా మారిన ఇన్ని పరిస్థితుల మధ్యలో థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత ఓటీటీ సదుపాయం ఉన్న అందరి ఇళ్ళల్లో అందుబాటులో ఉన్న ‘లూసిఫర్’ అనే మలయాళ సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులోకి రీమేక్ చేయాలనే ఆలోచన ఒక విధంగా సాహసమే . ‘మెగాస్టార్’ సినిమాల్లో తప్పక ఉండే డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ తదితర వాణిజ్య హంగులు లేని సినిమాను రీమేక్ అనగానే మాతృకను చూసిన చిరంజీవి అభిమానుల్లో కొందరు ఉత్సాహపడితే, మరికొందరు ఉత్కంఠకు లోనయ్యారు.

ఏది ఏమైనా – చిరంజీవికి తగ్గట్టు, ఆయన అభిమానులకు నచ్చేలా, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా మాతృక లోని హీరో పాత్ర తాలూకు ఔన్నత్యం దెబ్బతినకుండా దర్శకుడు, రచయిత కలిసి ‘గాడ్ ఫాదర్’ సినిమా స్క్రిప్టును, బ్రహ్మ గా చిరంజీవి పాత్రను మలిచారు.
‘గాడ్ ఫాదర్’గా బ్రహ్మ పాత్రలో చిరంజీవి నయనాభినయ కౌశలం – తన కోసం ఇక పై సరికొత్త పాత్రలు సృష్టించమని పాత, కొత్త, వర్ధమాన, రాబోయే రచయితలకు ‘మెగాస్టార్’ విసిరిన ‘ఛాలెంజ్’ అనిపించింది.

చనిపోయిన తన తండ్రికి నివాళులు అర్పించడానికి వచ్చిన బ్రహ్మ(చిరంజీవి)ను పరామర్శించే వంకతో కొందరు రాజకీయాలు చేయజూసే సన్నివేశంలో – తండ్రి లేడన్న ఆవేదనను, పదవి గురించి ప్రస్తావించిన వ్యక్తి పై ఆవేశాన్ని, జరుగుతున్న పరిణామాల పట్ల అసహ్యాన్ని పార్టీలో పరిణామాల దృష్ట్యా పథకం ప్రకారం సొంత చెల్లెలికే ఇబ్బంది కలిగే పరిస్థితుల్ని సృష్టించి అంతా తాను అనుకున్నట్టే జరుగుతున్నందుకు తన సంతృప్తిని, ఆ పరిస్థితుల్ని చేధించి తన అంచనాలు అందుకున్న చెల్లెలి పట్ల తన గర్వాన్ని, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళే ఇంటర్వెల్ సన్నివేశంలో బ్రహ్మపైన విజయం సాధించేశాడనే భ్రమల్లో జై (సత్యదేవ్) మాటలకు సమాధానంగా తన వెటకారాన్ని, జై ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరిస్తూ తన ధిక్కారాన్ని… ఆయా సన్నివేశాల్లో రెప్పపాటు వ్యవధిలో ఇన్ని హావభావాల్ని కేవలం తన కళ్ళతోనే పలికిస్తూ ఇటు అభిమానులకు, అటు సినిమా ప్రేక్షకులకు సరికొత్త చిరంజీవిగా పరిచయమయ్యాడు. బ్రహ్మ పాత్రలో చిరంజీవి నట వైదుష్యానికి పైన చెప్పినవి కేవలం ఉదాహరణలు మాత్రమే… ఒక్క మాటలో ‘గాడ్ ఫాదర్’ – మరో మెగా ఇన్నింగ్స్ కి నాంది !
జై చిరంజీవ !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Godfather
  • megastar chiranjeevi
  • sathya dev
  • tollywood

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Chiranjeevi-director Bobby Mega 158 movie Negative Role Dimple Hayathi

    Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్ గా డింపుల్ హయాతి?

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd