Ram Charan in Hollywood: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హాలీవుడ్ లోకి ‘రామ్ చరణ్ ’ ఎంట్రీ
రామ్ చరణ్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మెగా పవర్ స్టార్ గ్లోబర్ స్టార్ గా అవతరించబోతున్నాడు
- By Balu J Updated On - 12:56 PM, Thu - 9 March 23

మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి సినిమాలు రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ ను మరింత రెట్టింపు చేశాయి. కమర్షియల్ సినిమా అయినా, హిస్టారికల్ మూవీ అయినా రామ్ చరణ్ చాలా ఈజ్ తో నటిస్తూ మెగా వారసుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రభావం తగ్గుతున్న వేళ.. కుమారుడు రామ్ చరణ్ క్రేజ్ విదేశాలకు పాకుతుండటం గమనించవచ్చు.
ఇప్పటికే ఆస్కార్ వేదికపై అందరి ద్రుష్టి ఆకర్షించిన ఈ మెగా (Ram Charan) హీరో వరల్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయినా హాలీవుడ్ (Hollywood) లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు. పోడ్‌కాస్టర్ సామ్ ఫ్రాగాసోతో ఇటీవల జరిగిన సంభాషణలో తాను హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హాలీవుడ్ దిగ్గజాలు జూలియా రాబర్ట్స్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో కలిసి పనిచేయాలని రామ్ చరణ్ తన కోరికను కూడా వ్యక్తం చేశాడు.
ఈ ప్రకటన రామ్ చరణ్ అభిమానులను థ్రిల్ కు గురిచేసింది. “గ్లోబల్ స్టార్” గా అవతరించడానికి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఎస్ లో ఉన్న చరణ్ (Ram Charan) “ఎవరు హాలీవుడ్ నటుడిగా ఉండాలనుకోరు?” అని చెప్పడం కూడా మరింత ఆసక్తిని రేపింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆస్కార్ 2023కి RRR ప్రమోషన్‌లో యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నారు. ఈ చిత్రంలోని పాట “నాటు నాటు” ఉత్తమ పాటల విభాగంలో నామినేట్ చేయబడింది.
Also Read: RRR Oscar Promotions: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చపెడుతారా? ఆర్ఆర్ఆర్ పై తమ్మారెడ్డి ఫైర్

Related News

Rashmika Mandanna: ఆ హీరోనే నా ప్రేమికుడు: ఫ్యాన్స్ చిట్ చాట్ లో రష్మిక మందన్న
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మరోసారి అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది.