Chiru and Ravi Teja: డోన్ట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్!
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన పూనకాలు లోడింగ్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
- By Balu J Published Date - 06:10 PM, Fri - 30 December 22
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాత్రలను పరిచయం చేస్తూ ‘వాల్తేరు వీరయ్య’ మేకర్స్ రెండు విభిన్న ప్రోమోలను విడుదల చేశారు. టీమ్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటల్లోనూ మెగాస్టార్ చిరంజీవి అలరించారు. ఇప్పుడు మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజాలని కలిసి చూసే సమయం వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో పాట ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిరంజీవి, రవితేజ కలిసి నటించిన పూనకాలు లోడింగ్ పాటను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఒకరోజు ముందుగానే న్యూ ఇయర్ గిఫ్ట్ ని అందించారు మేకర్స్. ఈ పాటలో చిరంజీవి, రవితేజ ఒకరినొకరు ఫెరోషియస్ గా కనిపించారు. చిరంజీవి, రవితేజ కాంట్రాస్ట్ లుక్ లో అదరగొట్టారు. ఈ పాటలో ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. చిరు టైటిల్ రోల్ లో కనిపిస్తుండగా, రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని స్కోర్ చేసాడు.
బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
Related News
Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్‌తో చిరంజీవి ప్రత్యేక సమావేశం..
రష్యన్ డెలిగేట్స్‌తో చిరంజీవి ప్రత్యేక సమావేశం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండనంటూనే..