Ravi Teja First look Teaser: మెగా ‘మాస్’ యాక్షన్.. ఏసీపీగా రవితేజ అదుర్స్!
రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. వాల్తేరు వీరయ్య మూవీలో ఏసీపీగా కనిపించి అదుర్స్ అనిపించాడు.
- Author : Balu J
Date : 12-12-2022 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
రవితేజ (Ravi Teja) అంటేనే మాస్.. మాస్ అంటే రవితేజ. రవితేజకు సరైన మాస్ క్యారెక్టర్ పడాలేకానీ.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. గతంలో ఎన్నో పోలీస్ క్యారెక్టర్స్ తో అదరగొట్టాడు. తాజాగా మరోసారి రవితేజ (Ravi Teja) పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించి అదుర్స్ అనిపించాడు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). జనవరి 13న సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ పవర్ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ ఫస్ట్‌లుక్‌ని, టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో విక్రమ్ సాగర్ ఏసీపీ పాత్రను పరిచయం చేశారు. ఓ దట్టమైన అడవిలో వేగంగా దూసుకెళ్తున్న కారులో రవితేజ ఇండ్రక్షన్ సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత రౌడీలను వెంటాడుతూ వెటాడుతాడు. రవితేజ (Ravi Teja) చేతిలో చిన్న మేక, మరో చేతిలో తుపాకీతో మాస్ అవతార్ లో కనిపిస్తాడు. ఇక గొడ్డలితో సిలిండర్‌ను లాగడం, రౌడీలను చితకబాదడం లాంటి సీన్స్ ఉర్రూతలూగిస్తాయి.
రవితేజ (Ravi Teja) అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ కాకుండా బాబీ స్టైలిష్ టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన BGM ఆకట్టుకుంది. అయితే రవితేజ తెలంగాణ స్లాంగ్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం ఇంకా హైలైట్. అతను విలన్‌లను హెచ్చరించే విధానం సినిమాలో అతని మాస్ క్యారెక్టర్ ఎంటో తెలియజేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది, అక్కడ చిరంజీవి, శృతి హాసన్‌లపై పాటలు చిత్రీకరిస్తున్నారు.
Also Read: KCR BRS: బీఆర్‌ఎస్ ఆఫీస్ సిద్ధం.. నేడు ఢిల్లీకి కేసీఆర్!