Lavanya Tripathi Miss Perfect Trailer మెగా కోడలు మిస్ పర్ఫెక్ట్ ట్రైలర్.. చాలా రోజుల తర్వాత ఆ హీరో సర్ ప్రైజ్..!
Lavanya Tripathi Miss Perfect Trailer మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడిన తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన మొదటి ప్రాజెక్ట్ ని పూర్తి చేసింది.
- By Ramesh Published Date - 09:18 PM, Tue - 23 January 24

Lavanya Tripathi Miss Perfect Trailer మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడిన తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన మొదటి ప్రాజెక్ట్ ని పూర్తి చేసింది. విశ్వక్ డైరెక్షన్ లో సుప్రియ నిర్మించిన వెబ్ సీరీస్ మిస్ పర్ఫెక్ట్. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రామింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సీరీస్ లో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ హీరోగా నటించాడు. బిగ్ బాస్ విన్నర్ అయ్యాక దాదాపు 3 ఏళ్ల తర్వాత అభిజిత్ ఈ ప్రాజెక్ట్ చేశాడు.
We’re now on WhatsApp : Click to Join
ఇక ఈ సీరీస్ ట్రైలర్ విషయానికి వస్తే అనుకోకుండా హీరో ఇంటికి హీరోయిన్ వెళ్తే ఆమెను పని మనిషి అనుకుంటాడు హీరో. అలా రెడీ అవ్వడం హీరో ఇంటికి పని మనిషిగా వెళ్లడం ఇదే హీరోయిన్ చేస్తుంటుంది. తనకు అసలే శుభ్రంగా ఉండటం పరిసరాలను శుభ్రంగా ఉంచడం అంటే చాలా ఇష్టం అలాంటి హీరోయిన్ అతనితో ఎలా ప్రేమలో పడింది. ఎలా అతని మనసు గెలుచుకుంది అన్నది సీరీస్ కథ.
Also Read : Prabhas Raja Saab Chrismas Release : క్రిస్ మస్ కి రెడీ అవుతున్న రాజా సాబ్.. సలార్ సెంటిమెంట్ రిపీట్..!
ట్రైలర్ చూస్తే సీరీస్ చాలా రీఫ్రెషింగ్ గా ఉంటుందని అనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి ఈ సీరీస్ కు మెయిన్ అసెట్ అవ్వబోతుంది. మెగా కోడలిగా మారిన తర్వాత లావణ్య చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇదే. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి సీరీస్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. డిస్నీ హాట్ స్టార్ లో త్వరలో ఈ సీరీస్ రిలీజ్ కాబోతుంది.