Anjana Devi Health Update : తల్లి ఆరోగ్యంపై మెగా బ్రదర్ కీలక ప్రకటన
Anjana Devi Health Update : ఇప్పుడు నాగబాబు తల్లి ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వడం తో అంత హమ్మయ్య అనుకుంటున్నారు
- By Sudheer Published Date - 04:04 PM, Tue - 24 June 25

చిరంజీవి తల్లి అంజనా దేవి(Anjana Devi)కి అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని స్పష్టం చేశారు. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారని.. హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. తల్లి అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలిసి వెంటనే పవన్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈరోజు (మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.
Jagan Cheap Politics : జగన్ ఎగిరెగిరి పడేది వాళ్లను చూసుకొనేనా..?
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకుని మరీ పవన్ హైదరాబాద్‌కు వెళ్లారు. కేబినెట్‌కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) చెప్పి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారని ప్రచారం జరిగింది. అటు మెగా ఫ్యామిలీ సభ్యులు సైతం హాస్పటల్ కు వెళ్లారని ప్రచారం జరగడం తో మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం షాక్ కు గురయ్యారు. ఇప్పుడు నాగబాబు తల్లి ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వడం తో అంత హమ్మయ్య అనుకుంటున్నారు.
అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.
There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025