Meenakshi Chaudhary : ముద్దు సీన్లపై హీరోయిన్ కామెంట్.. అసభ్యకరంగా అనిపించకపోతే..!
టాలీవుడ్ లో కొత్త భామ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మెరుపులు తెలిసిందే. సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హర్యానా భామ
- By Ramesh Published Date - 01:18 PM, Sun - 28 January 24

టాలీవుడ్ లో కొత్త భామ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మెరుపులు తెలిసిందే. సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హర్యానా భామ హిట్ 2, ఖిలాడి సినిమాల్లో నటించింది. రీసెంట్ గా వచ్చిన మహేష్ గుంటూరు కారం సినిమాలో మహేష్ మరదలి పాత్రలో నటించింది అమ్మడు.
We’re now on WhatsApp : Click to Join
మీనాక్షికి ఉన్న క్రేజ్ కి మహేష్ సినిమాలో అంత చిన్న పాత్ర ఎందుకు చేసిందని అనుకుంటున్నా ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ మర్చిపోలేనని అంటుంది మీనాక్షి.
ఈ సినిమా కోసం పనిచేయడం.. మహేష్ తో మొదటి సీన్ ఎక్స్ పీరియన్స్ అంతా అద్భుతమని అంటుంది మీనాక్షి. కెరీర్ లో ఆచి తూచి అడుగులేస్తున్న మీనాక్షి కేవలం ఇలాంటి పాత్రలే చేయాలని గిరిగీసుకోలేదని చెబుతుంది. పాత్ర ప్రాధాన్యతని బట్టి సినిమాలు చేస్తానని అంటుంది. అంతేకాదు సినిమా డిమాండ్ చేస్తే కచ్చితంగా లిప్ లాక్ సీన్స్ కూడా చేస్తానని కాకపోతే అవి అసభ్యకరంగా ఉండకూడదని అంటుంది మీనాక్షి.
తన కోసం కొన్ని నియమాలు తనకు తానుగా పెట్టుకున్నానని అంటున్న మీనాక్షి కంఫర్ట్.. స్క్రిప్ట్ ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే చెప్పేస్తానని అంటుంది. ఆ కారణాల వల్లే పెద్ద సినిమాలను వదులుకున్నానని అంటుంది మీనాక్షి. కేవలం ముద్దు సీన్స్ కోసమే సినిమాలు చేయనని అంటుంది మీనాక్షి.
టాలీవుడ్ తన పై చూపిస్తున్న ఆప్యాయత మర్చిపోనని అంటున్న మీనాక్షి భాష ఏదైనా మంచి సినిమా చేయాలన్నదే తన కల అని అంటుంది. డబ్బు కంటే నేను చేసే పనిలో ప్రశంసలు గౌరవం కోరుతానని అంటుంది మీనాక్షి చౌదరి. సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి వ్యతిరేకిని కాదు కానీ ఇప్పుడప్పుడే చేయకూడదని అంటుంది మీనాక్షి చౌదరి.
Also Read : Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం.. లక్ష్మణుడిగా టాలీవుడ్ స్టార్.. రాముడు సీత ఎవరో తెలుసుగా..?