HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mass Ka Das Vishwak Sen Who Released The Trailer Of Sit Movie

Vishwak Sen: ‘సిట్’ మూవీ ట్రైలర్ విడుదల చేసి అభినందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్

  • By Balu J Published Date - 12:55 PM, Fri - 10 May 24
  • daily-hunt
Sit
Sit

Vishwak Sen: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ‘SIT'(సిట్ – స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. VBR (విజయ్ భాస్కర్ రెడ్డి) దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కుతుంది.

సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నారు. నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిట్ చిత్ర ట్రైలర్ ని యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ ట్రైలర్ చూసి చాలా ఆసక్తికరంగా ఉందని మూవీ యూనిట్ ని అభినందించారు.

ఇక ఈ సిట్ చిత్ర ట్రైలర్ ను చూస్తుంటే..మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నుంచి ఓపెన్ అయ్యి ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గరికి వస్తే అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు అని సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో ‘We Take The Words Duty, Honour and Compassion’ అని తమ జాబ్ గురించి నిజాయితీ నిబద్దత కలిగిన పోలీసాఫీసర్ గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్ గా నిలిచింది.

ఇక ఈ సిట్ చిత్రానికి బాలిరెడ్డి, రమేష్ గుండా, వాసిరెడ్డి నరేంద్ర సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరికుప్పల యాదగిరి మ్యూజిక్ అందిస్తుండగా జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా, కిరణ్ తుంపెర ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

తారాగణం : అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ, నటాషా దోషి, రుచిత సాదినేని, అనిల్ రాథోడ్, కౌశిక్ మేకల.. తదితరులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • SIT
  • trailer released
  • vishwak sen

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd